2000 Notes:రిజర్వ్ బ్యాంక్ సంచలన నిర్ణయం.. రూ.2 వేల నోటు ఉపసంహరణ , మార్చుకోవడానికి గడువు
Send us your feedback to audioarticles@vaarta.com
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది. రూ. 2 వేల నోట్లను చెలామణీ నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలిపింది. రూ.2 వేల నోటును వినియోగదారులకు అందుబాటులో వుంచొద్దని స్పష్టం చేసింది. రూ.2 వేల నోట్లు వున్న వారు సెప్టెంబర్ 30లోగా బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవాలని ఆర్బీఐ సూచించింది. దేశంలోని19 ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లోనూ రూ.2 వేల నోట్లు మార్చుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు తెలిపింది. 2018-19 ఆర్ధిక సంవత్సరంలోనే రూ.2 వేల నోట్ల ముద్రణ నిలిపివేశామని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. అయితే ఒక్కొక్కరు ఒక విడతల రూ.2 వేల నోట్లు పది మాత్రమే మార్చుకునే అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పింది. క్లీన్ నోట్ పాలసీలో భాగంగనే రూ. 2 వేల నోట్లు ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ తెలిపింది.
రూ.2 వేల నోటును రద్దు చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్లు :
పెద్ద నోట్ల రద్దు తర్వాత నవంబర్ 10 , 2016 నుంచి మనదేశంలో రూ.2 వేల నోట్లు చెలామణిలోకి వచ్చాయి. గతకొంతకాలంగా బ్యాంకులు, ఏటీఎంలలో రూ.2 వేల నోట్లు అందుబాటులో లేవు. ప్రస్తుతం దేశంలో 3.52 లక్షల కోట్ల విలువైన రూ.2 వేల నోట్లు చెలామణిలో వున్నట్లుగా సమాచారం. అయితే రూ.2 వేల నోటును రద్దు చేస్తారంటూ గత కొంతకాలంగా ఊహాగానాలు వినిపించాయి. అయితే ఆర్బీఐ ఎప్పటికప్పుడు వాటిని ఖండించింది. పలువురు ఆర్ధిక వేత్తలు, ప్రముఖులు కూడా రూ.2000 నోటును రద్దు చేయాలని కోరారు కూడా. ఈ నేపథ్యంలోనే రిజర్వ్ బ్యాంక్ ఈ నిర్ణయాన్ని తీసుకుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com