విజయ్ జవాబుకు ఫక్కున నవ్విన రిపోర్టర్స్!
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ సినిమా రిలీజ్ అవుతోందంటే కుర్రకారులో ఎలాంటి ఉత్సాహం ఉంటుందో ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. అది కూడా ప్రేమికుల రోజున సినిమా అంటే ఇక ఆ కిక్కే వేరుగా ఉంటుంది. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ అంటూ విజయ్ రేపు ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాడు. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ తెలుగు రాష్ట్రాల్లో భారీగా జరిగిన విషయం విదితమే. అయితే ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో విజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సందర్భంగా ‘డియర్ కామ్రేడ్’ ప్రస్తావన వచ్చింది.
అసలేం జరిగిందంటే..!
ఈ సినిమా గురించి చెప్పాలని ఇంటర్వ్యూలో మీడియా ప్రతినిధులు అడిగారు. ఇందుకు స్పందించిన విజయ్.. ‘బంగ్లాదేశ్, పాకిస్తాన్, నార్త్ ఇండియాలో నా కెరీర్‌లో బిగ్గెస్ట్ ఓపెనర్. బిగ్గెస్ట్ నంబర్స్ వచ్చాయి’ అని బదులిచ్చాడు. ఇదేంటి ఈయన ఇలా చెబుతున్నాడని రిపోర్టర్లు ఆశ్చర్యపోయారు. ఈ క్రమంలో ఓ రిపోర్టర్ ‘డియర్ కామ్రేడ్’ పాక్‌లో రిలీజ్ అయ్యిందా..? అని అడగ్గా.. నాలుకరుచుకున్న విజయ్.. ‘ అవును రిలీజ్ అయ్యింది కదా.. యూట్యూబ్‌లో’ అని బదులిచ్చాడు. అయితే ఆయనిచ్చిన సమాధానంకు ఫక్కున నవ్వేశారు. అనంతరం యథావిథిగా ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ఇంటర్వ్యూను కొనసాగించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com