ఏపీలో ఐదు చోట్ల రీ-పోలింగ్...
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఏప్రిల్-11న సార్వత్రిక ఎన్నికలు జరిగిన విషయం విదితమే. అయితే కొన్ని చోట్ల అవాంఛనీయ సంఘటనలు జరగడం.. రిగ్గింగ్ పాల్పడినట్లు ఫిర్యాదులు అందడంతో ఐదు పోలింగ్ బూత్‌లలో రీ-పోలింగ్ నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. నెల్లూరు జిల్లాలో రెండు, గుంటూరులో రెండు, ప్రకాశంలో ఒక చోట రీపోలింగ్ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి సీఈవో గోపాలకృష్ణ ద్వివేది సిఫార్సు చేశారు. నెల్లూరు జిల్లాలో వీవీ ప్యాట్ స్లిప్పుల కలకలంపై ద్వివేది సీరియస్ అయ్యారు. ఆర్వో, ఏఆర్వోలపై కేసు నమోదు చేయడం జరిగింది. ఎన్నికల విధుల్లో సిబ్బంది పొరపాటు చేస్తే శిక్ష తప్పదని ద్వివేది హెచ్చరించారు. రీ-పోలింగ్ ఎప్పుడు నిర్వహించేదీ మంగళవారం (ఏప్రిల్ 16) రాత్రికి ప్రకటిస్తామని ఈసీ తెలిపింది. ఈ ఐదు పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఆయా జిల్లా కలెక్టర్లు ఇచ్చిన స్క్రూటినీ రిపోర్టులను రాష్ట్ర ఎన్నికల సంఘం పరిశీలించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout