ఏపీలో ఐదు చోట్ల రీ-పోలింగ్...

  • IndiaGlitz, [Tuesday,April 16 2019]

ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా ఏప్రిల్-11న సార్వత్రిక ఎన్నికలు జరిగిన విషయం విదితమే. అయితే కొన్ని చోట్ల అవాంఛనీయ సంఘటనలు జరగడం.. రిగ్గింగ్ పాల్పడినట్లు ఫిర్యాదులు అందడంతో ఐదు పోలింగ్‌ బూత్‌లలో రీ-పోలింగ్‌ నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. నెల్లూరు జిల్లాలో రెండు, గుంటూరులో రెండు, ప్రకాశంలో ఒక చోట రీపోలింగ్‌‌ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి సీఈవో గోపాలకృష్ణ ద్వివేది సిఫార్సు చేశారు. నెల్లూరు జిల్లాలో వీవీ ప్యాట్‌ స్లిప్పుల కలకలంపై ద్వివేది సీరియస్‌ అయ్యారు. ఆర్వో, ఏఆర్వోలపై కేసు నమోదు చేయడం జరిగింది. ఎన్నికల విధుల్లో సిబ్బంది పొరపాటు చేస్తే శిక్ష తప్పదని ద్వివేది హెచ్చరించారు. రీ-పోలింగ్ ఎప్పుడు నిర్వహించేదీ మంగళవారం (ఏప్రిల్ 16) రాత్రికి ప్రకటిస్తామని ఈసీ తెలిపింది. ఈ ఐదు పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఆయా జిల్లా కలెక్టర్లు ఇచ్చిన స్క్రూటినీ రిపోర్టులను రాష్ట్ర ఎన్నికల సంఘం పరిశీలించింది.

More News

ఎవరికి ఓటేశారో మాకు తెలిసిపోతుంది..!

ఇదేంటి టైటిల్ చూడగానే ఆశ్చర్యపోతున్నారా..? అవును మీరు వింటున్నది నిజమే. గుజరాత్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే రమేశ్ కటారా ఈ వ్యాఖ్యలు చేసి అందర్నీ అయోమయంలోకి నెట్టారు.

రేసు గుర్రాల్లా దూసుకుపోయిన స్టాక్‌మార్కెట్లు

దేశీయ స్టాక్‌మార్కెట్లు నాలుగో రోజు కూడా లాభాలతో రేసు గుర్రాల్లా దూసుకుపోయాయి.

కిమ్‌తో నాలుగోసారి చర్చకు సిద్ధమైన మూన్‌ జే

ఉత్తర కొరియా-దక్షిణ కొరియా అధ్యక్షుల మధ్య ఇప్పటికే చర్చలు జరిగిన విషయం విదితమే. అయితే చర్చలు విఫలం కావడంతో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌తో నాలుగోసారి

ఎన్డీ తివారీ కుమారుడు రోహిత్ అనుమానాస్పద మృతి

ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ ఎన్డీ తివారీ కుమారుడు రోహిత్ శేఖర్ తివారీ దేశ రాజధాని ఢిల్లీలో అనుమానాస్పద స్థితిలో కన్నుమూశాడు.

మెట్రోలో ప్రయాణిస్తున్న మహిళలూ తస్మాత్ జాగ్రత్త...

మెట్రోలో ప్రయాణించాలంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. రైలు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ఏమాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా అంతే సంగతులు.