రేణు కొత్త అవతారం...
Send us your feedback to audioarticles@vaarta.com
రేణు దేశాయ్ ..ఈ పేరు తెలుగు సినీ లోకాని పరిచయం అక్కర్లేని పేరు. పవన్ మాజీ భార్యగా రేణుదేశాయ్ అందరికీ తెలిసినవారే. అయితే రేణు సినిమాల్లో రాకముందు ఓ మోడల్ తర్వాత కాస్ట్యూమ్ డిజైనర్, ఎడిటర్‌గా కూడా పేరుంది. మరాఠీ చిత్రం ఇష్క్‌వాలా లవ్ అనే చిత్రంతో 2014లో దర్శకురాలిగా కూడా మారారు.
అయితే త్వరలోనే రేణుదేశాయ్ ఓకొత్త అవతారం ఎత్తనున్నారు అదే వ్యాఖ్యాతగా. ప్రస్తుతం సినీ సెలబ్రిటీలను హోస్ట్‌లుగా పరిచయం చేస్తున్న టీవీ సంస్థ స్టార్ మా. అక్కినేని నాగార్జున, మెగాస్టార్ చిరంజీవిలను మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రామ్‌తో, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ను బిగ్ బాస్ షో ద్వారా హోస్ట్‌లుగా బుల్లితెర వైపు నడిపించారు. తాజాగా వీరొక భారీ డ్యాన్స్ ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తున్నారట. ఈ షోకు రేణుదేశాయ్‌ను హోస్ట్‌గా పరిచయం చేయబోతున్నారని సమాచారం. దీనిపై వివరాలు త్వరలోనే తెలుస్తాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com