Renu Desai: పవన్ కల్యాణ్‌కు నాలాగా ప్రేమ లేదు.. ఫ్యాన్స్‌పై రేణుదేశాయ్ ఆగ్రహం..
Send us your feedback to audioarticles@vaarta.com
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాజీ హీరోయిన్ రేణు దేశాయ్‌తో విడాకులు తీసుకుని సంవత్సరాలు గడుస్తున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఎవరి జీవితం వాళ్లు లీడ్ చేస్తున్నారు. పవన్ మరో పెళ్లి చేసుకోగా.. రేణు అకీరా, ఆధ్యను చూసుకుంటూ ఉంది. ఈ క్రమంలో పిల్లల గురించి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉంటుంది. అయితే ఆమె పెట్టిన పోస్టులకు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ పవన్ పేరును ప్రస్తావిస్తూ ఉంటారు. దీంతో ఆమె కాస్త అసహనానికి గురవుతున్నారు. తాజాగా తన పెంపుడు జంతువులకు సంబంధించిన ఓ వీడియోను ఇన్ స్టాలో రేణు షేర్ చేశారు.
రేణు దేశాయ్ షేర్ చేసిన వీడియోకు ‘మీది కూడా పవన్ కల్యాణ్ లాగే గోల్డెన్ హార్ట్’ అంటూ ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. దీంతో ఆ నెటిజన్‌పై రేణు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘నా పోస్టులను ప్రతిసారి నా ఎక్స్ హస్బెండ్ తో ఎందుకు కంపేర్ చేస్తారు? పదేళ్ల వయసు నుంచి నాకు జంతువులంటే ప్రేమ. ఇప్పటికే ఇలాంటి వాళ్ళని చాలామందిని బ్లాక్ చేశాను. డిలీట్ చేశాను. నేను సింగిల్‌గా యానిమల్ సర్వీస్ చేస్తున్నాను. నా ఎక్స్ హస్బెండ్ నాలాగా యానిమల్ లవర్ కాదు’ అంటూ ధీటుగా జవాబు ఇచ్చారు. మేం విడిపోయి సంత్సరాలు గడిచినా ఇంకా ప్రతిదానికీ ఆయనతో పోల్చడమేంటని మండిపడ్డారు.
ఈ కామెంట్‌ని స్క్రీన్ షాట్ తీసిన రేణు దేశాయ్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ "ఇలాంటి రిప్లైలు నాకు చాలా బాధని, కోపాన్ని కలిగిస్తున్నాయి. ఎన్నేళ్ళైనా నా సొంతంగా నేనేం చేసినా దాన్ని నా ఎక్స్ హస్బెండ్ తో కంపేర్ చేస్తారు. అతనితో నాకు ఎలాంటి పర్సనల్ ప్రాబ్లమ్ లేదు. కానీ అతని ఫాలోవర్స్ నన్ను నన్నుగా వదిలేయండి అని" పోస్ట్ చేసింది. దీంతో రేణు పోస్ట్ వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్స్ ఆమె లైఫ్ ఆమెని బతకనివ్వండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే రెండు రోజుల క్రితం రూ.3500 డొనేట్ చేయమని రేణు దేశాయ్ పోస్ట్ చేయడం వైరల్‌గా మారింది. తో కొందరు డొనేట్ చేయగా.. ఇంకొందరు ఆమె అకౌంట్ హ్యాక్ అయిందని కామెంట్లు పెట్టారు. దీనిపై ఆమె స్పందిస్తూ ఓ సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. ''కొద్ది రోజులుగా నా ఆరోగ్యం బాలేదు. అందుకే వీడియోలు చేయలేదు. అయితే రూ.3500 కోసం రిక్వెస్ట్ పెట్టింది నేనే. నేను కూడా రెగ్యులర్‌గా డబ్బులు డొనేట్ చేస్తుంటాను. కానీ నాకు కూడా లిమిట్ ఉంటుంది. నా దగ్గర కూడా కొంత డబ్బు మాత్రమే ఉంది. నాకు నా పిల్లలకు కూడా కావాలి కదా అందుకే నా వరకు సాయం చేశాక.. ఏదైనా బ్యాలెన్స్ ఉంటే ఫాలోవర్స్‌ను అడుగుతున్నాను.
ఈ మధ్య కాలంలో డొనేషన్లు ఎక్కువగా చేస్తున్నాను. ముఖ్యంగా యానిమల్స్, చిన్నపిల్లల ఫుడ్ కోసం డొనేట్ చేస్తున్నాను. నేను డొనేట్ చేసిన తర్వాత అవసరం అనుకుంటే మీకు అడుగుతాను. త్వరలోనే షెల్టర్ కూడా కడతాను. అప్పుడు అధికారికంగా డొనేషన్ అడుగుతాను. మీ సపోర్ట్ కు థ్యాంక్యూ. రేపు ఫుడ్ ప్యాకెట్స్ అండ్ డొనేషన్ కు సంబంధించిన పిక్స్ మీతో షేర్ చేసుకుంటాను" అని వీడియోలో తెలిపింది. దీంతో ఆమె దాతృత్వం పట్ల నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments