రేణూదేశాయ్ పల్లెబాట!
- IndiaGlitz, [Friday,August 10 2018]
రేణూ దేశాయ్ ఇప్పుడు వార్తల్లో వ్యక్తి. మొన్నటివరకు పవన్‌కల్యాణ్ మాజీ భార్యగా, ఇప్పుడు ఆయన పిల్లల తల్లిగా, మరోవైపు కొత్త తోడును వెతుక్కుని త్వరలో మూడుముళ్ల బంధంతో ఒకింటికి చేరుకోబోతున్న నవ ఇల్లాలిగా, ఇంకో వైపు డైరక్ట్ తెలుగు సినిమా చేయబోతున్న దర్శకురాలిగా..! ఇన్ని రకాలుగా వార్తల్లో ఉన్న రేణూదేశాయ్ ఇప్పుడు మరోసారి వెలుగులోకి వచ్చారు. త్వరలో ఆమె పల్లెబాట పట్టనున్నారు.
తన తాజా సినిమాలో ప్రధాన కథ రైతు సమస్య. రైతుల సమస్యలను ఏసీ గదుల్లో కూర్చుని తెరకెక్కించడం ఇష్టంలేని రేణూదేశాయ్ తాజాగా పల్లెటూర్లకు వెళ్లి అక్కడ రైతుల సమస్యలను గురించి ప్రత్యక్షంగా తెలుసుకోనున్నారు. ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే పూర్తయిందట. త్వరలోనే పల్లెప్రయాణం పూర్తయితే ఆమె సినిమా ప్రారంభం గురించి ప్రకటిస్తారట. 2019 ప్రథమార్ధంలో ఈ సినిమాను చేయబోతున్నట్టు వినికిడి. రేణు ఇంతకు ముందు మంగళాష్టక్ సినిమాతో నిర్మాతగా, ఇష్క్ వాలా లవ్‌తో దర్శకురాలిగా తనను తాను ప్రూవ్ చేసుకున్న సంగతి తెలిసిందే.