తెలుగులో రేణుదేశాయ్ డైరెక్ష‌న్‌...

  • IndiaGlitz, [Thursday,July 26 2018]

హీరోయిన్‌గా, ఎడిట‌ర్‌, కాస్ట్యూమ్స్ డిజైన‌ర్‌, నిర్మాత‌, ద‌ర్శ‌కత్వం ఇలా అన్ని విభాగాల్లో త‌న‌కంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్న ప‌వ‌న్ క‌ల్యాణ్ మాజీశ్రీమ‌తి రేణుదేశాయ్. పెళ్లి త‌ర్వాత మ‌ళ్లీ మెగాఫోన్ ప‌ట్ట‌నుంద‌ట‌. ఇది వ‌ర‌కు రేణుదేశాయ్‌.. 'ఇష్క్ వాలా ఇన్ ల‌వ్‌' అనే మ‌రాఠీ సినిమాను డైరెక్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే.

తెలుగులో కూడా ఆ సినిమాను అనువాదం చేశారు కూడా. కాగా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో రైతు స‌మ‌స్య‌ల‌పై ఓ క‌థ‌ను సిద్ధం చేస్తున్నార‌ట‌. స్క్రీన్‌ప్లే కూడా సిద్ధ‌మైంద‌ట‌. మాట‌లు రాస్తున్నారు. వ‌చ్చే ఏడాది సంక్రాంతికి సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తాన‌ని రేణు చెప్పుకొచ్చార‌ట‌.