పిల్లలిద్దరిదీ నా రక్తం.. పవన్‌ది కాదు : రేణు

  • IndiaGlitz, [Monday,December 30 2019]

టైటిల్ చూడగానే ఇదేంటి విచిత్ర వాదన అని అనుకుంటున్నారా..? అవునండోయ్.. ఈ మాటలు స్వయంగా టాలీవుడ్ పవర్‌స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ నోటి నుంచి వచ్చినవే.. అసలేంటి ఈ వాదన..? రేణుకు ఎందుకిలా అన్నది..? ఏ సందర్భంలో అనాల్సి వచ్చింది..? అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

పిల్లలిద్దరూ నా సొంతం!

రేణు దేశాయ్.. సోషల్ మీడియాలో యమా యాక్టివ్‌గా ఉంటారన్న విషయం తెలిసిందే. అంతేకాదు.. అప్పుడప్పుడు అభిమానులు చేసిన కామెంట్స్‌కు రిప్లైలు కూడా ఇస్తుంటారు. అయితే వల్గర్‌గా మాట్లాడిన.. అతిగా మాట్లాడినా రేణూ మాత్రం అస్సలు ఊరుకోదు.. తాట తీస్తుందంతే!. మరీ ముఖ్యంగా తన పిల్లలు గురించి ఏమైనా మాట్లాడితే మాత్రం ఇక వాళ్ల పనైపోయినట్లే!. తాజాగా.. కొడుకు అకీరా తన చెల్లెలు ఆద్యని ఎత్తుకొని ఉన్న ఫోటోని తన ఇన్‌స్టాగ్రామ్‌లో రేణు షేర్ చేసింది. ఈ ఫొటోకు ‘1 2 3 అని లెక్కపెట్టేలోపు నేను మీ ముందు ఉంటా.. ఆద్య, అకీరా క్రేజీ ఫెల్లోస్.. వారిద్దరూ నా సొంతం’ అంటూ క్యాప్షన్‌గా ఇచ్చింది. అయితే దీన్ని రకరకాలుగా అర్థం చేసుకున్న కొందరు నెటిజన్లు, పవన్ ఫ్యాన్స్ చిత్రవిచిత్రాలుగా కామెంట్స్ చేశారు.

వాళ్లిద్దరిదీ నా రక్తం..!

ఈ కామెంట్స్‌కు బాగా చిర్రెత్తడంతో కొందరు నెటిజన్లు చేసిన కామెంట్స్‌కు ఘాటుగా స్పందించింది. సైన్స్‌ పరంగా చెప్పాలంటే వారిద్దరిలో ప్రవహించేది తన రక్తమని.. మీకు సైన్స్‌ తెలిస్తే ఈ విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదని ఓ పవన్ వీరాభిమాని కామెంట్‌కు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. అంతేకాదు మరో నెటిజన్ ఫ్యాన్స్ ఎన్నె్న్నో మాట్లాడుతుంటారు..? వాటినెందుకు పట్టించుకుంటారు..? అని ప్రశ్నించాడు. ఇందుకు రేణు రియాక్ట్ అవుతూ.. అమ్మతనం గురించి వారు మాట్లాడుతూ ఉంటే నేను ఎలా మౌనంగా ఉంటాను చెప్పండంటూ కామెంట్ చేశారు. తన రక్తం.. అంటూ మాట్లాడుతుంటే కొందరు పవన్ వీరాభిమానులు కాస్త అతిగానే స్పందించారు. అయితే ఇది కాస్త పవన్ ఫ్యాన్స్ వర్సెస్ రేణుగా మారింది. అంటే పిల్లలిద్దరిలో ఉండేది పవన్ రక్తం కాదు.. తన రక్తమేనని రేణు చెబుతోందన్న మాట. మరి దీనిపై పవన్ ఎలా రియాక్ట్ అవుతాడో..!

More News

'మత్తువదలరా' చిత్రాన్ని అభినందించిన ప్రభాస్

ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్.ఎమ్ కీరవాణి తనయుడు   శ్రీసింహా కథానాయకుడిగా, మరో తనయుడు కాలభైరవ సంగీత దర్శకుడిగా  పరిచయమైన చిత్రం మత్తు వదలరా.

బాలీవుడ్ రీమేక్‌లో నాగార్జున‌

కింగ్ నాగార్జున ఇప్పుడు స్టైల్ మార్చారు. వ‌రుస సినిమాలు చేసేయాల‌ని కాకుండా అచి తూచి త‌న ఏజ్‌కు త‌గిన‌ట్లు స్క్రిప్ట్స్‌ను ఆయ‌న ఎంచుకుంటున్నారు.

‘ఎన్ని అడ్డంకులు ఎదురైనా.. జగన్ గుండె ధైర్యానికి జేజేలు’

ఎన్ని అడ్డంకులు ఎదురైనా సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకుని ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి చూపించారని సమాచార, ప్రజా సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని చెప్పుకొచ్చారు.

దిల్ రాజుకు తలనొప్పిగా మారిన సంక్రాంతి రిలీజులు

ప్ర‌స్తుతం  తెలుగు చలన చిత్ర పరిశ్రమలో స్టార్ నిర్మాత‌ల్లో దిల్‌రాజు ఒక‌రు. పెద్ద హీరోలు, చిన్న హీరోలనే  తేడా లేకుండా బ్యాక్ టూ బ్యాక్ ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేయడం ఆయ‌న‌ అలవాటు.

నేవీ కీలక నిర్ణయం.. సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్లు నిషేధం

భారత రక్షణ దళాలను లక్ష్యంగా చేసుకొని గత కొన్ని రోజులుగా పాకిస్తాన్, చైనాతో పాటు పలుదేశాలు హనీట్రాప్‌కు పాల్పడుతున్న సంగతి తెలిసిందే.