మహిళలు వారి కొడుకులను సరిగా పెంచాలి - రేణుదేశాయ్
Send us your feedback to audioarticles@vaarta.com
పవన్ కల్యాణ్ మాజీ భార్య ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన పిల్లలను చూసుకోవడానికి వ్యక్తి అవసరం అంటూ వ్యాఖ్యానించింది. దీనిపై కొంతమంది నెగటివ్‌గా మాట్లాడటం, కామెంట్ చేయడం మొదలుపెట్టారు. కొందరు ఓ అడుగు ముందుకేసి నువ్వు మా వదినవు, నువ్వు ఇంకో పెళ్లి గురించి ఆలోచిస్తే, నిన్నుద్వేషిస్తామంటూ రేణుకు ఫేస్బుక్ ద్వారా మెసేజ్‌లు కూడా పంపారు.
అయితే రేణు తనకు వచ్చిన కామెంట్స్ అన్నింటినీ స్క్రీన్ షాట్ తీసి వాటిని విమర్శిస్తూ తన ఫేస్బుక్ అకౌంట్ ద్వారానే సమాధానం చెప్పడం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఈ పోస్ట్ నా వ్యక్తిగతమైంది కాదు. లింగ వివక్ష చూపడంలో మగవాళ్ల మనస్తత్వం ఎలా ఉందో తెలుసుకోవచ్చు. ఇలాంటి కామెంట్స్ చదివినప్పుడు అసలు మనం ఎలాంటి సమాజంలో, ఎలాంటి మగవాళ్ల మధ్య బ్రతుకుతున్నామనే ఆందోళన కలుగుతుంది. మన దేశంలో ఒక మగవాడు ఎన్నిసార్లు అయినా, ఎంతమందినైనా పెళ్లి చేసుకోవచ్చు.
కానీ ఓ అమ్మాయి మాత్రం మరో రిలేషన్ షిప్ గురించి ఆలోచించడం తప్పు. అంటే అమ్మాయి తప్పు చేసిన దానిలా ఒంటిరిగా బ్రతకాలా? ఈరోజు నేను దేవుణ్ని ప్రార్థించేది ఒకటే. మనం దేశంలో అమ్మాయిల భవిష్యత్ బాగుండాలంటే, మహిళలు వాళ్ల పిల్లల్ని సరిగ్గా పెంచాలి. అప్పుడే వాళ్ల మైండ్ సెట్లో మార్పు వస్తుంది అంటూ రేణు తన భావాలను పోస్ట్ చేసింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com