నా పెళ్లిపై హడావుడెందుకు.. కచ్చితంగా చేసుకుంటా!

  • IndiaGlitz, [Wednesday,April 17 2019]

ప్రముఖ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ రెండో పెళ్లి గురించి అప్పట్లో పెద్ద ఎత్తున హడావుడి జరిగిన సంగతి తెలిసిందే. నిశ్చితార్థం కూడా అయిపోయినప్పటికీ పెళ్లి మాత్రం ఇంకా జరగలేదు. ఈమె పెళ్లి చేసుకుంటోందని సోషల్ మీడియాలో ఒకట్రెండు పోస్ట్‌లు పెట్టడంతో పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు, మెగాభిమానులు పెద్ద ఎత్తున ట్రోల్స్ చేశారు. దీంతో కొద్ది రోజుల పాటు అటు సోషల్ మీడియాలో.. ఇంటర్వ్యూల్లో ఎక్కడా ఆమె పెళ్లి గురించి ప్రస్తావించనేలేదు. రేణూ సైలెంట్ అవ్వడంతో రేణూ పెళ్లి ఆగిపోయిందని అందరూ అనుకున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ పెళ్లి వ్యవహారంపై ఆమె క్లారిటీ ఇచ్చింది.

నాదేం దొంగపెళ్లి కాదు.. అధికారికంగా చేసుకుంటా!

నాకు ఇదివరకే నిశ్చితార్థం అయిపోయింది. కచ్చితంగా పెళ్లి చేసుకుంటాను. సినిమాల వల్ల నేను ఒక పబ్లిక్‌ పర్సన్‌ కావచ్చేమో కానీ.. నాకు ఒక పర్సనల్‌ లైఫ్‌ ఉంటుంది కదా! దాన్ని నా అభిమానులకు తెలియజేసేందుకు పెళ్లి గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ పెట్టాను. అంతే కానీ ఆ విషయాన్ని రహస్యంగా దాచిపెట్టాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే అదేమీ దొంగపెళ్లి కాదు. నా పెళ్లిపై కూడా పెద్ద చర్చ.. రచ్చ.. జరిగింది. నాకు, నా ఫ్రెండ్స్‌కి, నా పిల్లలకు లేని హడావుడి బయట వాళ్లకు ఉంది. నా పెళ్లి గురించి ఎలాంటి సందేహాలు పెట్టుకోవద్దు.. త్వరలోనే అధికారికంగా పెళ్లి చేసుకుంటాను. పెళ్లి అంటే చాలా ప్రాసెస్ ఉంటుంది. దానికి కాస్త సమయం పడుతుంది. నాకు కాబోయే భర్త పూణేలో ఓ ఐటీ కంపెనీలో డైరెక్టర్ స్థాయిలో పని చేస్తున్నాడు అని రేణుదేశాయ్ ఓ ఇంటర్వ్యూలో తనపెళ్లి పుకార్లపై క్లారిటీ ఇచ్చేసింది.