అభిమానులు అర్థం చేసుకోండి - రేణు
- IndiaGlitz, [Saturday,July 01 2017]
పవన్‌కళ్యాణ్ నుండి రేణుదేశాయ్ విడిపోయింది. ఇప్పుడు నిర్మాతగా రాణిస్తూ, పిల్లల్ని పెంచి పెద్ద చేస్తుంది. సోషల్ మీడియాలో రేణు చాలా యాక్టివ్‌గా ఉంటుంది. పవన్ అభిమానులు మాత్రం పవన్‌కళ్యాణ్, రేణుదేశాయ్‌లు కలిసిపోవాలని కోరుకుంటున్నారు. ఇదే విషయమై రేణుకు ఆమె ఫేస్ బుక్ పేజ్ ద్వారా విన్నపాలు కూడా చేస్తున్నారు. ఈ వార్తలన్నింటికి రేణుదేశాయ్ ఈరోజు సమాధానం చెప్పేసింది.
అభిమానులు నా పట్ల చూపిస్తున్న అభిమానానికి థాంక్స్. నేను, కళ్యాణ్‌గారు విడిపోయి నాలుగేళ్ళవుతుంది. కళ్యాణ్‌గారు అనా అనే అమ్మాయిని పెళ్ళి చేసుకున్నారు. వారికి ఓ కూతురు కూడా ఉంది. ఆయన వివాహ బంధాన్ని, ఆయన కుమార్తెకు జన్మనిచ్చిన తల్లిని గౌరవిస్తూ నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నా..నేను, పవన్‌కళ్యాణ్‌గారు ఎప్పటికీ ఒకటి కాలేం. అలా ఏకం కావాలని పదే పదే మీరు కోరవద్దు. ఆయన నా పిల్లలకు తండ్రి. నేనూ, కళ్యాణ్‌గారు మంచి స్నేహితులం మాత్రమే. అభిమానులు ఈ నిజాన్ని అర్థం చేసుకోవాలి. నన్ను కళ్యాణ్‌గారి దగ్గరకు వెళ్ళమని కోరడం సబబు కాదు. నిజాయితీతో నేను చేసిన విన్నపాన్ని అర్థం చేసుకోవాలని కూడా కోరారు.