అకిరా గురించి రేణు దేశాయ్ విన్నపం..!
- IndiaGlitz, [Friday,August 19 2016]
రేణు దేశాయ్ ఇష్క్ వాలా లవ్ అనే చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ - రేణు దేశాయ్ ల తనయుడు అకిరా నందన్ తొలిసారి నటించారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 4న ఈటీవీ ప్రసారం చేస్తుండడంతో అకిరా నందన్ డెబ్యూ మూవీ బుల్లితెర పై రాబోతుంది అంటూ రేణు సంతోషాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.
ఈ విషయం పై రేణు దేశాయ్ స్పందిస్తూ...అకిరా తొలి పరిచయం గురించి ఓ చిన్న మాట. ఇష్క్ వాలా లవ్ లో ఏక్ట్ చేసినప్పుడు మా అకిరాకి 9 సంవత్సరాలు. కమర్షియల్ వేల్యూస్ ని పక్కన పెడితే...అకిరాని డైరెక్ట్ చేయడం తల్లిగా నాకు ఒక సెంటిమెంటల్ మూమెంట్..! చిన్న డెబ్యూట్ రోల్... ఎక్కువ ఎక్స్ పెక్ట్ చేయద్దు అని నా విన్నపం. ఎంజాయ్ హిజ్ మినీ స్ర్కీన్ డెబ్యూట్ అంటూ తన మనసులో మాటలు బయటపెట్టారు రేణు దేశాయ్..!