నేను ఏ పొలిటికల్ పార్టీలో చేరుతానో మీకెందుకు : రేణుదేశాయ్
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ టాప్ హీరో, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రజా పోరాట యాత్రలో భాగంగా కర్నూలు జిల్లాలో పర్యటించినప్పుడు సరిగ్గా అదే టైమ్‌లో ఆయన మాజీ భార్య రేణు దేశాయ్ కూడా పర్యటించిన విషయం విదితమే. అప్పట్లో రేణు రాజకీయాల్లోకి వచ్చేస్తున్నారని.. పక్కా ప్లాన్‌తోనే వైసీపీ వాళ్లే రంగంలోకి దించుతున్నారని పెద్ద ఎత్తున కథనాలు పుట్టుకొచ్చాయి. అంతేకాదు పవన్ ఎక్కడ్నుంచి పోటీచేసినా సరే ఆయనపై వైసీపీ తరఫున రేణును బరిలోకి దించుతారని కూడా పుంకాలు పుంకాలుగా వార్తలు వచ్చేశాయి. ఇవన్నీ చూసిన రేణు ఆవేదనకు లోనై ఓ వీడియో రూపంలో ఈ వ్యవహారంపై క్లారిటీ ఇచ్చేశారు.
"రైతు సమస్యలపై ఓ చిత్రం చేస్తున్నా. అందులో భాగంగా టీవీ షో చేసి రైతుల ఆత్మహత్యలు.. వారి కష్టాలను తెలుసుకోవడానికి రిపోర్టర్‌గా మారాను. ఇలా చేస్తున్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. నేను కామ్‌గా ఉండాల్సిన అవసరం లేదు. ఇన్నాళ్లు మౌనంగా ఉండి.. ఉండి ఇంకా ఎక్కువ సమస్యలు తెచ్చుకున్నాను. నాపై ఇష్టం వచ్చినట్టుగా కొంతమంది వాగుతున్నారు. వాళ్లకు మెంటల్ ఉందో మరేమైందో తెలియదు కానీ.. నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు" అని రేణు ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏ పొలిటికల్ పార్టీలో చేరుతానో అనేది మీకెందుకు?
"నేను ఇంతకు ముందే చెప్పా ఏ పొలిటికల్ పార్టీలో జాయిన్ అవ్వట్లేదని ఇదివరకే చెప్పాను. మీకు కొంచెం అయినా బుద్ధి ఉండాలి కదా.. నేను ఏదైనా పొలిటికల్ పార్టీలో జాయిన్ అవ్వాలంటే అది సీక్రెట్‌గా ఉండదు. ప్రపంచం మొత్తం తెలుస్తుంది. ఎవరైనా పార్టీలో జాయిన్ అయితే ప్రెస్ మీట్ పెట్టి మరీ వెళ్తారు. సైలెంట్‌గా పార్టీలోకి వెళ్లరు. నేను ఏ పార్టీలోకి వెళ్లడమే కాదు.. ఏ పార్టీకి సపోర్ట్ కూడా కాదు.
అయినా నేను ఏ పొలిటికల్ పార్టీలో చేరుతానో అనేది మీకు ఎందుకు..?. అవన్నీ నా వ్యక్తిగత విషయం మీకెందుకు..? ప్రస్తుతం నేను రైతు సమస్యల్ని తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నా. పనీపాటా లేని ముర్ఖులు ఈ విషయంపై అనవసరమైన కామెంట్స్ చేస్తున్నారు" అని తపై నెగిటివ్ కామెంట్ చేసే వాళ్లకు రేణు దేశాయ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. సో ఇకనైనా రేణుపై పనిగట్టుకుని రూమర్స్ క్రియేట్ చేస్తున్న కొందరు ఇకనైనా ఆపుతారో లేకుంటే యథావిథిగా ఎవరేమనుకుంటే మాకేంటి అని ముందుకెళ్తారో వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments