ట్విట్టర్ లో ఫైర్ అవుతున్న రేణుదేశాయ్..
Send us your feedback to audioarticles@vaarta.com
రేణుదేశాయ్..బద్రి సినిమాతో హీరోయిన్ గా తెలుగుతెరకు పరిచయమవ్వడం... పవన్ ను పెళ్లి చేసుకోవడం...విడిపోవడం తెలిసిన విషయమే. ఆతర్వాత రేణు దేశాయ్..నిర్మాతగా, దర్శకురాలిగా మారి కెరీర్ కొనసాగిస్తుంది. అలాగే ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాలను పంచుకుంటూ వార్తలో ఉంటున్నారు. ఈరోజు ట్విట్టర్ లో ఉదయాన్నే దేవాలయానికి వెళ్లి దేవుడిని దర్శించుకుంటే మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో అంటూ సంప్రదాయంగా చీరలో ఉన్న తన ఫోటోను పోస్ట్ చేసారు.
రేణు ట్విట్ చూసిన ఓ వ్యక్తి రేణు దేశాయ్ గురించి ఓ ఆర్టికల్ రాసాడు. ఇంతకీ ఏమని రాసాడంటే..సామాన్య జనం ప్రతి రోజు పూజ చేస్తారు. కానీ...సినిమా వాళ్లు మాత్రం సినిమా రిలీజ్ అవుతున్న సమయంలోనే సక్సెస్ కోసం గుడికి వెళ్లి పూజా చేస్తారు. రేణు దేశాయ్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఇష్క్ వాలా లవ్ డిసెంబర్ లో రిలీజ్ అవుతుంది. అలాగే పవన్ కళ్యాణ్ సర్ధార్ గబ్బర్ సింగ్ జనవరిలో రిలీజ్ అవుతుంది. అందుచేత ఈ రెండు సినిమాలు సక్సెస్ అవ్వాలని కోరుకునేందుకే రేణు దేశాయ్ గుడికి వె్ళ్లారని రాసాడు. ఈ ఆర్టికల్ చదివిన రేణుకి కోపం వచ్చింది. వెంటనే ట్విట్టర్ లో ఈ వ్యక్తికి నిజంగా పనిపాట లేదు అంటూ ఫైర్ అయ్యింది. గుడికి వెళితే మనసు ప్రశాంతంగా ఉంటుందనేది అందరికీ తెలిసిన విషయమే. ఇలాంటి విషయాన్ని ట్విట్టర్ లో పోస్ట్ ఎందుకూ..? ఎవరో..ఈ విషయం గురించి వేరేలా ఆలోచించి స్పందిస్తే...మళ్లీ రేణు ప్రతి స్పందించడం ఎందుకూ..? ఏమిటో...అంతా ట్విట్టర్ మాయ.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments