Akira: అకీరా ఎంట్రీపై ట్రోలింగ్ .. కష్టపడనిదే ఏది రాదు : ఇచ్చిపడేసిన రేణూ దేశాయ్
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు చిత్ర పరిశ్రమలో ఏ కుటుంబంలో లేనంత మంది హీరోలు మెగా ఫ్యామిలీలో వున్నారు. తొలుత చిరంజీవి ఆయన అడుగుజాడల్లో నాగబాబు, పవన్ కల్యాణ్‌లు ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాతి తరంలో అల్లు అర్జున్ హీరోగా పరిచయమయ్యారు. ఆ వెంటనే చిరంజీవి నటవారసుడిగా రామ్ చరణ్ అడుగుపెట్టారు. ఇక అల్లు శిరీష్, నిహారిక, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, కల్యాణ్ దేవ్, వైష్ణవ్ తేజ్‌లు రంగ ప్రవేశం చేశారు. అయితే మెగా ఫ్యామిలీలోని అందరి కొడుకులు , కూతుళ్లు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు కానీ పవన్ పరిస్థితి ఏంటని ఆయన ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
వారసులకు సులువుగా అవకాశాలంటూ ట్రోలింగ్ :
రెండ్రోజుల క్రితం పవన్ కుమారుడు అకీరా నందన్ ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు మనవడితో కలిసి కనిపించాడు. దీంతో దర్శకేంద్రుడి చేతుల మీదుగా అకీరా లాంచింగ్ అని.. సినిమాకు కొబ్బరికాయ కొట్టేశారని కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఇంకొందరైతే వారసులకు ఇండస్ట్రీలో సులువుగా అవకాశాలు వస్తాయంటూ వ్యాఖ్యానించారు. అకీరాను అడ్డుపెట్టుకుని మెగా ఫ్యామిలీ, పవన్ కల్యాణ్‌లను కొందరు టార్గెట్ చేసి సోషల్ మీడియాలో పిచ్చిరాతలు రాశారు.
స్టార్ వారసులను టార్గెట్ చేస్తారు :
ఈ నేపథ్యంలో పవన్ సతీమణి రేణూ దేశాయ్ స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. ‘‘ అంబానీ తన కంపెనీని తన పిల్లలకు కాకుండా బయటివాళ్లకు ఇస్తే అది కరెక్టేనా అని ప్రశ్నించారు. ఇండస్ట్రీకి చెందిన వారసులు సులభంగానే ఎంట్రీ ఇస్తున్నారు. కానీ వాళ్లు తల్లిదండ్రుల వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లలేకపోయినా.. నటులుగా రాణించలేకపోయినా, కొందరు వారిని ఏ మాత్రం కనికరం లేకుండా ట్రోల్ చేస్తున్నారు. అదే .. స్టార్ వారసులు కాకుండా కొత్తగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి వాళ్లు ఒకవేళ విఫలమైతే ఎవరూ పట్టించుకోరు. కానీ సక్సెస్ అయితే మాత్రం వాళ్లు గొప్ప స్టార్స్ అవుతారు. ఇక్కడ అసలు సంగతి ఏంటంటే.. వారసులు ఎంట్రీ ఇవ్వడం ముఖ్యం కాదు.. వాళ్లలోని టాలెంట్ ముఖ్యం. ప్రతిభ కొలమానంగా స్టార్స్ అవుతారే తప్ప.. వారసులు కావడం వల్ల కాదు’’ అంటూ ఇచ్చిపడేశారు.
అకీరాకు హీరో అవ్వాలని లేదు :
అకీరా ఇంకా ఇండస్ట్రీలోకి అడుగుపెపట్టకముందే ఇంతగా అతనిపై విరుచుకుపడుతున్నారని రేణూ దేశాయ్ మండిపడ్డారు. అందరూ అనుకున్నట్లుగా అకీరాకు హీరో అవ్వాలని లేదని, ఎంతో శ్రమించి పియానో నేర్చకుంటున్నాడని ఆమె చెప్పారు. ఏది కూడా సులభంగా రాదని రేణూ అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout