Renu Desai:హీరోగా కాదు, సంగీత దర్శకుడిగా అకీరా నందన్.. ఆశీర్వదించాలన్న రేణూ , పవన్ ఫ్యాన్స్ రియాక్షన్ ఏంటో

  • IndiaGlitz, [Friday,April 14 2023]

తెలుగు చిత్ర పరిశ్రమలో ఏ కుటుంబంలో లేనంత మంది హీరోలు మెగా ఫ్యామిలీలో వున్నారు. తొలుత చిరంజీవి ఆయన అడుగుజాడల్లో నాగబాబు, పవన్ కల్యాణ్‌లు ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాతి తరంలో అల్లు అర్జున్ హీరోగా పరిచయమయ్యారు. ఆ వెంటనే చిరంజీవి నటవారసుడిగా రామ్ చరణ్ అడుగుపెట్టారు. ఇక అల్లు శిరీష్, నిహారిక, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, కల్యాణ్ దేవ్, వైష్ణవ్ తేజ్‌లు రంగ ప్రవేశం చేశారు. అయితే మెగా ఫ్యామిలీలోని అందరి కొడుకులు , కూతుళ్లు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు కానీ పవన్ పరిస్థితి ఏంటని ఆయన ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

సైలెంట్‌గా అకీరా నందన్ ఎంట్రీ:

పవన్ కుమారుడు అకీరా నందన్ పెరిగి పెద్దవాడవ్వడంతో పాటు మంచి ఒడ్డూ పొడుగు వుండటంతో ఈ కుర్రాడు హీరోగా ఎంట్రీ ఇస్తారని ఫ్యాన్స్ భావించారు. అకీరా ఎంట్రీ గురించి వెయిట్ చేస్తున్నామంటూ పలుమార్లు ట్వీట్స్ కూడా చేశారు. అయితే అందరికీ షాకిస్తూ అకీరా నందన్ హీరో కాకుండా మ్యూజిక్ డైరెక్టర్‌గా రూట్ సెట్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. దీనికి కారణం లేకపోలేదు. రైటర్స్ బ్లాక్ అనే షార్ట్ ఫిల్మ్‌కు అకీరా నందన్ సంగీతాన్ని అందించాడు. కార్తీక్ యార్లగడ్డ తెరకెక్కించిన ఈ షార్ట్ ఫిల్మ్‌ను ఇంగ్లీష్‌లోనే తెరకెక్కించారు. అకీరా నందన్ ఇచ్చిన మ్యూజిక్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది.

చిన్నప్పటి నుంచి సంగీత ప్రపంచంలోనే అకీరా :

అయితే అకీరాకు తండ్రి అడుగుజాడల్లో హీరో అవ్వాలని చిన్నప్పటి నుంచే లేనట్లుగా వుంది. అతనికి పూర్తిగా సంగీత ప్రపంచంలో సెటిలవ్వాలనే ఉన్నట్లుగా తెలుస్తోంది. గతంలో పియానోపై మ్యూజిక్ ప్లే చేసిన వీడియోలు వైరల్ అయ్యాయి కూడా. అయితే ఏదో ఇంట్రెస్ట్ కొద్ది అలా చేశాడని మెగా ఫ్యాన్స్ భావించారు. మెగా వారసుడిగా చూడాలనుకుంటే .. సైలెంట్‌గా మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడంటూ ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు.

తన బిడ్డను ఆశీర్వదించాలన్న రేణూ :

ఈ నేపథ్యంలో అకీరా నందన్ తల్లి , సినీనటి రేణూ దేశాయ్ స్పందించారు. తన బిడ్డ సొంతంగా ప్రత్యేక స్థానాన్ని కనుగొన్నాడని, ఇందుకు తనకు సంతోషంగా వుందన్నారు. తన బిడ్డను ఆశీర్వదించాల్సిందిగా రేణూ దేశాయ్ కోరారు. మరి దీనిపై మెగా, పవన్ ఫ్యాన్స్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.

More News

KTR:చీమలపాడు ఘటనలో కుట్ర కోణం... మంత్రి కేటీఆర్ స్పందన ఇదే

ఖమ్మం జిల్లా చీమలపాడులో జరిగిన అగ్నిప్రమాదం ఘటనలో గాయపడిన వారిని గురువారం మంత్రులు కేటీఆర్,

Vizag Steel Plant : వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం ట్విస్ట్.. ఇప్పట్లో ఆ ఆలోచన లేదన్న కేంద్ర మంత్రి

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల రాజకీయాలు విశాఖలోని ఉక్కు కార్మాగారం చుట్టూ తిరుగుతున్నాయి.

YS Jagan Mohan Reddy:దేశంలోనే రిచ్ సీఎంగా వైఎస్ జగన్.. చివరి స్థానంలో మమతా బెనర్జీ, కేసీఆర్ ర్యాంక్ ఎంతంటే..?

దేశంలో వున్న 30 మంది ముఖ్యమంత్రుల్లో .. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యంత ధనవంతుడిగా నిలిచారు.

Sonu Sood:రియల్ స్టార్‌కు నీరాజనం.. 2500 కేజీల బియ్యంతో సోనూసూద్ చిత్రం, వీడియో వైరల్

సోనూసూద్... వెండితెరకు విలన్‌గానే తెలిసిన ఈ వ్యక్తి, అతని వ్యక్తిత్వం కోవిడ్ కష్టకాలంలో లోకానికి తెలిసింది.

Sanjay Dutt:షూటింగ్‌లో బాంబ్ బ్లాస్ట్.. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్‌కు గాయాలు, ఆసుపత్రికి తరలింపు

ఇటీవలి కాలంలో సినిమా షూటింగుల్లో పలువురు హీరోలు, హీరోయిన్లు ప్రమాదాల బారినపడిన సంగతి తెలిసిందే.