పెళ్లి ..కాబోయే భ‌ర్త గురించి రేణు కామెంట్‌?

  • IndiaGlitz, [Tuesday,June 26 2018]

ప‌వ‌న్ క‌ల్యాణ్ నుండి ఏడేళ్లు విడిగా కామ‌న్‌గా ఉంటున్న రేణు దేశాయ్ త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకోనుంది. రేణు రెండో పెళ్లి గురించి ప‌లువురు ప‌లు కామెంట్స్ విన‌ప‌డుతున్నాయి. కొంద‌రు పాజిటివ్‌గా ఉంటే.. కొంద‌రు ప‌వ‌న్ ఫ్యాన్స్ నెగ‌టివ్‌గా రేణుని పెళ్లి చేసుకోవ‌ద్దంటూ కోరారు. ప‌వ‌న్‌క‌ల్యాణ్ సైతం రేణు సంతోష‌క‌ర‌మైన జీవితం గ‌డ‌పాలంటూ మెసేజ్ పోస్ట్ చేయ‌డం విశేషం.

కాగా త‌న రెండో పెళ్లి గురించి రేణు ''జీవితంలో ప్రేమ ఒకేసారి పుడుతుంది. మ‌ళ్లీ పుట్ట‌దు. ఏడేళ్లు ఒంటిరిగా..సంతోషంగా ఉన్నా. ఈ పెళ్లి త‌ర్వాత కూడా సంతోషంగానే ఉంటాన‌నిపిస్తుంది. ఎందుకంటే కాబోయే భ‌ర్త ప్ర‌శాంత‌మైన వ్య‌క్తి. మ‌ళ్లీ స‌హ‌జీవ‌నం చేయాల‌నుకోవ‌డం లేదు. అందుక‌నే పెళ్లి చేసుకుంటున్నా' అని రేణు తెలిపారు. రేణుకి ఈ సంబంధాన్ని ఆమె స్నేహితులుకు కుదిర్చారట‌.