ఒకరి కూతురిగానో.. భార్యగానో జీవించొద్దు : రేణు దేశాయ్ సంచలన పోస్ట్
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రముఖ నటి రేణుదేశాయ్ సోషల్ మీడియా వేదికగా సంచలన, స్ఫూర్తినిచ్చే పోస్ట్ పెట్టారు. తనను చాలా మంది ఎలా చూస్తున్నారో పేర్కొంటూ తనను అనుసరించే యువతులందరికీ ఓ సందేశం ఇచ్చారు. ఒకరి భార్యగానో.. కూతురిగానో జీవించవద్దని.. మీకంటూ ఓ ప్రత్యేకమైన జీవితముందని వెల్లడించారు. మీ బలాబలాలను, సామర్థ్యాన్ని నమ్మి ముందుకు సాగాలన్నారు. ఒక దుర్గలా.. లక్ష్మిలా.. సరస్వతిలా ఉండాలని సూచించారు.
చాలా మంది ప్రజల దృష్టిలో నేను ఏమిటి? సింగిల్ పేరెంట్.. సంతోషంగా ఉండే స్త్రీ.. పురుషుల ప్రపంచంలో తన నిబంధనలపై జీవించే స్త్రీ... గట్టిగా.. ధృడంగా మాట్లాడే వ్యక్తి.. పురుషిని సపోర్టు లేకుండా తన పిల్లలను పర్ఫెక్ట్‌గా పెంచే తల్లి.. సమాజపు కట్టుబాట్లను నిరాకరించిన స్త్రీ.. స్థిరమైన అభిప్రాయం కలిగి ఉన్నదాన్ని.. ఫైనాన్షియల్ డెసిషన్స్ అన్నీ స్వయంగా తీసుకుంటూ సమర్థంగా వ్యాపారాన్ని నిర్వహించగలను.. సమాజంలో పేరుకుపోయిన పితృస్వామ్య డిమాండ్లకు అనుగుణంగా ఉండటానికి ఇష్టపడని స్త్రీని. అయితే వీటన్నింటికీ బదులుగా నేను కేవలం ఒక మొండి దాన్నిగా.. వెర్రిదాన్నిగా చూడబడుతున్నా.
నన్ను అనుసరించే యువతులందరికీ స్వతంత్ర ఆలోచన విధానం ఉండటం మంచిదేనని చెబుతున్నా. మీ గుర్తింపు ఒకరి కుమార్తె గానో భార్య గానో ఉండకూడదు. స్త్రీవాదం అంటే.. సంప్రదాయ విలువలను అగౌరవపరచడం కాదు.. కుటుంబ సంప్రదాయాల ముసుగులో శతాబ్దాలుగా నడుస్తున్న అన్యాయానికి అండగా నిలబడటం. మీ బలాన్ని, సామర్థ్యాలను నమ్మండి. దుర్గలా.. లక్ష్మిలా.. సరస్వతిలా మారండి. ఈ మూడు లక్షణాలను అలవరుచుకోండి. మీ జీవితాన్ని మీరే సరిదిద్దుకోండి’’ అని రేణు దేశాయ్ పేర్కొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout