పవన్ సినిమాలో కీలకపాత్రలో రేణు..!!

  • IndiaGlitz, [Saturday,February 01 2020]

టాలీవుడ్ టాప్ హీరో, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు సినిమాలకు పవన్ సంతకం చేయగా.. తాజాగా..వీరాభిమానులకు మైత్రీ మూవీస్ తియ్యటి శుభవార్త అందించింది. పవన్‌తో తమ సంస్థ త్వరలోనే సినిమా చేయబోతోందని అధికారికంగా ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. అయితే.. ఈ సినిమా కూడా ఇదివరకే ‘గబ్బర్ సింగ్’ తెరకెక్కించిన హరీశ్ శంకర్‌‌తో ఈ సినిమా కావడం విశేషమని చెప్పుకోవచ్చు.

కీలక పాత్రలో!

అయితే తాజాగా ఇంట్రెస్టింగ్ విషయం వెలుగుచూసింది. పవన్ సినిమాలో రేణు నటిస్తోందన్నదే దాని సారాంశం. పవన్-హరీశ్ శంకర్ సినిమాలో రేణు నటిస్తోందని.. ఆమె పాత్రే సినిమాకు కీలకమని తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్తలు టాలీవుడ్‌లో ఊపందుకున్నాయి. వాస్తవానికి ఈ మధ్యే ఈమె మీడియాతో మాట్లాడుతూ.. మంచి మంచి పాత్రలు వస్తే తాను చేయడానికి రెడీగా ఉన్నానని స్పష్టం చేసింది. ఈ తరుణంలో తాజా రూమర్స్ నిజమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నట్లుగా తెలుస్తోంది.

మొత్తం మూడు సినిమాల్లో!

ఇప్పటికే ‘పింక్’ రీమేక్, క్రిష్ దర్శకత్వంలో మరో మూవీ ఉండగా.. తాజాగా మైత్రీ మూవీస్ ప్రకటనతో మొత్తం మూడు సినిమాల్లో పవన్ నటించనున్నారన్న మాట. ‘గబ్బర్ సింగ్’ తర్వాత పవన్-హరీశ్ శంకర్ కాంబినేషన్లో మరోసారి సినిమా వస్తుండటంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి. మరి సినిమా ఎప్పుడు ఉంటుందో..? స్టోరీ ఎలా ఉంటుందో తెలియాలంటే కొన్నిరోజులు వేచి చూడాల్సిందే.

More News

అందుకే సినిమాల్లో నటిస్తున్నా.. బీజేపీతో పొత్తు!?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ మళ్లీ సినిమాలు చేస్తున్నారని.. బీజేపీతో పొత్తుపెట్టుకుని అన్నయ్య ప్రజారాజ్యం పార్టీలాగా చేసేశారని విమర్శలు వస్తున్న నేపథ్యంలో జనసేనాని రియాక్ట్ అయ్యారు.

ఆర్జీవీ భావోద్వేగ ట్వీట్.. !

సంచలనాల దర్శకుడు ఆర్జీవీ .. ఓ ఎమోషనల్ స్క్రిప్టును ఎంచుకున్నారు. యథార్థ కథాంశాలతో సినిమాలు తీసే రామ్ గోపాల్ వర్మ... తెలుగు నాట సంచలనం సృష్టించిన దిశ ఘటనపై సినిమా తీస్తున్నట్టు ట్విట్టర్

ముంబై టూ హైదరాబాద్.. ‘హారన్’ మోగిస్తే అంతే!

భారతదేశంలో అత్యంత రద్దీగల ప్రాంతాల్లో ముంబై మొదటి వరుసలో ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ ఆర్థిక రాజధానిలో ఎంతమంది వాహనాలు వాడుతున్నారో.. దానివల్ల ఎంతెంత కాలుష్యం అవుతోందో లెక్కలేదు.

బడ్జెట్‌-2020తో తెలుగు రాష్ట్రాలకు ఒరిగిందేంటి!?

కేంద్ర బడ్జెట్-2020లో తెలుగు రాష్ట్రాలకు ప్రకటించిందేమీ లేదు. స్మార్ట్ సిటిలు, రైల్వే లైన్ల సంఖ్య మాత్రమే చెప్పగా వాటిలో తెలుగు రాష్ట్రాలకు కూడా ఉంటాయని అనుకుంటున్నారే తప్ప..

కేంద్ర బడ్జెట్ 2020: ధరలు పెరిగేవి, తగ్గేవి ఇవే..!

కేంద్ర ప్రభుత్వం బడ్జెట్-2020ను ఇవాళ ఉభయ సభల్లో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. వాస్తవానికి కేంద్ర బడ్జెట్‌ వల్ల సామాన్యుడికి ఏదో ఒకరుగుతుందనుకుంటే తీరా చూస్తే ఆశించినంతగా కేటాయింపులు లేవు.