ఫ్యాన్స్ పై ఫైర్ అవుతున్న రేణుదేశాయ్..!
Send us your feedback to audioarticles@vaarta.com
రేణుదేశాయ్...పరిచయం అవసరం లేని పేరు ఇది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఏక్టివ్ గా ఉంటూ తన అభిప్రాయాలను పంచుకునే రేణుదేశాయ్ ఫ్యాన్స్ పై ఫైర్ అవుతున్నారు. ఇంతకీ ఎవరి ఫ్యాన్స్ పై రేణు దేశాయ్ ఫైర్ అవుతున్నారు అంటే...రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడినా...పవన్ ఫోటోలు పోస్ట్ చేసినా ఇప్పుడు ఇదంతా అవసరమా..? అందరి దృష్టి ఆకర్షించడానికే రేణు ఇలా చేస్తుంది అంటూ కొంత మంది విమర్శలు చేస్తున్నారట.
ఈ విమర్శలు రేణుదేశాయ్ ని బాగా బాధపట్టాయట. అందుకే ఈ విమర్శల పై రేణుదేశాయ్ స్పందిస్తూ...వేరే హీరోల అభిమానులే ఇలా నన్ను విమర్శిస్తున్నారు. వాళ్ల ప్రస్టేషన్ అంతా సోషల్ మీడియాలో చూపిస్తున్నారు. మీ హీరోను మీరు అభిమానించండి కానీ...వేరే హీరోను, వాళ్లకు సంబంధించిన వ్యక్తులపై విమర్శలు చేయడం కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ గారి ఫోటో అందరూ పెట్టుకోవచ్చు. నేను పెట్టుకుంటే తప్పా..? అంటూ ప్రశ్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టద్దు అని చెప్పినంత మాత్రాన నేను పెట్టడం మానేస్తానా..? కళ్యాణ్ గారికి లేని అభ్యంతరం వేరే వాళ్లకు అభ్యంతరం ఏమిటో నాకు అర్ధం కావడం లేదు అంటూ తన మనసులో మాటలు బయటపెట్టారు..! మరి...ఇప్పుడైనా రేణుదేశాయ్ పై విమర్శలు చేసే వాళ్లు ఆపేస్తారో లేదో చూడాలి..!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout