కూతురు కోసం...రేణు దేశాయ్ మార్చిందిలా..!

  • IndiaGlitz, [Friday,September 02 2016]

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఆయ‌న కుమార్తె ఆద్య అమ్మ రేణు దేశాయ్ కి ఓ మాట చెప్పింద‌ట‌. ఈ విష‌యాన్నిరేణు దేశాయ్ ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌చేసింది. ఇంత‌కీ ప‌వ‌న్ కుమార్తె ఆద్య ఏం చెప్పింది అంటే...మ‌మ్మీ ఈరోజు నాన్న బ‌ర్త్ డే క‌దా. అందుచేత నువ్వు నీ ఫోన్ లో నాన్న ఫోటో పెట్టుకో అని చెప్పింద‌ట‌. కేవ‌లం నా కుమార్తె ఆద్య ఆనందం కోసం ఈరోజు డీపీ మార్చాన‌ని ట్వీట్ చేసారు.
ఫేస్ బుక్, ట్విట్ట‌ర్ లో త‌న ఫోటో పెట్టుకున్న రేణు దేశాయ్ కుమార్తె చెప్పింద‌ని ఈరోజు త‌న ట్విట్ట‌ర్ & ఫేస్ బుక్ లో ప‌వ‌న్ ఫోటోను ప్రొఫైల్ గా పెట్టుకున్నారు. దీంతో సూప‌ర్ వ‌దిన‌మ్మా, క్యూట్ డాట‌ర్, ధ్యాంక్యూ... అంటూ రేణుదేశాయ్ కు ట్విట్ట‌ర్ ద్వారా థ్యాంక్స్ తెలియ‌చేస్తున్నారు ప‌వ‌న్ అభిమానులు..! అది సంగ‌తి..!