నెటిజన్లపై రేణు దేశాయ్ ఫైర్
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రముఖ నటి రేణూ దేశాయ్ నెటిజన్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది పెట్టే సరదా మెస్సేజ్‌లు కారణంగా నిజమైన బాధితులకు సాయం అందకుండా పోతోందని అకారణంగా వారు ప్రాణాలు కోల్పోతున్నారని రేణు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్‌మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే రేణు గత కొన్నిరోజుల నుంచి ఇన్‌స్టా వేదికగా సాయం కోరిన కొవిడ్ బాధితులకు తన వంతు చేయూత అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమె నెటిజన్లకు కొన్ని సూచనలు చేశారు. ఇక మీదట ‘హాయ్, హలో’ అంటూ సరదా మెసేజ్‌లు పెట్టవద్దని తెలిపారు.
కాగా, తాజాగా ఆమె మరోసారి అదే విషయాన్ని నెటిజన్లకు తెలియజేశారు. ‘దయచేసి నాకు హాయ్, హలో అనే మెస్సేజ్‌లు పంపొద్దు. ఈ మెస్సేజ్‌లు కారణంగా పలువురి ప్రాణాలు పోతున్నాయి. సాయం కోరుతూ పంపుతున్న వాళ్ల సందేశాలు కిందకు వెళ్లిపోతున్నాయి. నేను ఎప్పటి నుంచో చెబుతున్నాను. ఈ మెసేజ్‌ల కారణంగా అవసరమున్న వారి మెసేజ్‌లు కిందకు వెళ్లిపోతున్నాయి. దానివల్ల నేను ఆ మెస్సేజ్‌లు చూడడానికి కూడా వీలు కావడం లేదు. కాబట్టి ఇదొక సీరియస్ మెసేజ్. మీరు చేసే ఇలాంటి చిన్న చిన్న పనుల కారణంగా సరైన సమయంలో సాయం అందక కొంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు. అలాగే ప్రస్తుతానికి నేను ఎవరికీ ఆర్థిక సాయం చేయడం లేదు.
జోక్ కాదు.. ఎందుకు ఇలాంటి మెసేజ్‌లు పెడుతున్నారు. కొవిడ్ కారణంగా తీవ్ర అనారోగ్యానికి గురైన వారికి, ఆసుపత్రులు, మందుల విషయంలో నాకు చేతనైనంత సాయం చేస్తున్నాను. ఇకనైనా మారండి. దయచేసి నాకు సరదా మెస్సేజ్‌లు పెట్టకండి’’ అని రేణు పేర్కొన్నారు. అంతేకాకుండా తన పేరుతో ట్విటర్లో ఉన్న ఖాతాని ఎవరూ ఫాలో కావొద్దని.. అది తనది కాదని ఆమె స్పష్టతనిచ్చారు. ‘‘నేను డబ్బు ఇవ్వలేను. ఎవరైతే డెత్ బెడ్‌పై ఉన్నారో.. అలాంటి వారికి ఎవరికైనా సీరియస్‌గా ఉంటే చెప్పండి మెడిసిన్ పంపిస్తా కానీ హాయ్, హలో అనే మెసేజ్‌లు మాత్రం పెట్టకండి. నేను విసిగిపోతున్నా. ఈ మెసేజ్‌ల కారణంగా మీరు ఏం సాధిస్తారు? ఒకరి ప్రాణాలు పోవడానికి కారణమవుతారు’’ అంటూ మరోసారి రేణు స్ట్రిక్ట్‌గా చెప్పారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout