'రెండక్షరాలు' ఆడియో విడుదల!
- IndiaGlitz, [Wednesday,December 23 2015]
లోకేష్‌రెడ్డి, అక్షర జంటగా శ్రీనివాసరావు.యం దర్శకత్వంలో శ్రీ కంచమ్మతల్లి సినీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై పైల దేవదాస్‌రెడ్డి నిర్మిస్తోన్న చిత్రం రెండక్షరాలు'. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది. శ్రీకాకుళం టీడీపి విప్ కోన రవికుమార్ బిగ్ సీడీని, మహేశ్వరం టీ ఆర్ ఎస్ ఎమ్మేల్యే తీగల కృష్ణారెడ్డి ఆడియో సీడీలను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా...
మహేశ్వరం ఎమ్మేల్యే తీగల కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ''అమ్మ, నాన్న, అక్క, చెల్లి, ప్రేమ ఇలా రెండక్షరాలతో ఎన్నో అద్భుతమైన పదాలున్నాయి .అలాంటి టైటిల్ తో వస్తున్న ఈ సినిమాలో కూడా మంచి కంటెంట్ ఉంటుందనుకుంటున్నా. పాటలు, ట్రయిలర్స్ చూశాక ఇదొక చక్కటి ప్రేమకథా చిత్రమనిపించింది. ప్రేమపై వచ్చిన చిత్రాలన్నీ సక్సెస్‌ను సాధించాయి. ఈ సినిమా కూడా ఆ కోవలోనే పెద్ద సక్సెస్ సాధించి యూనిట్‌కు మంచి పేరు తేవాలి'' అని అన్నారు.
ఇచ్ఛాపురం ఎమ్మేల్యే బెంగలం అశోక్ మాట్లాడుతూ...మా ఏరియా నుంచి వచ్చి ఈ సినిమా రూపొందిస్తున్న దర్శక నిర్మాతలక నా శుభాకాంక్షలు. పాటలు, ట్రయిలర్స్ చాలా బావున్నాయి. ఈ సినిమా విజయవంతమై వారికి మంచి పేరు తీసుకరావాలి అని అన్నారు.
దర్శకుడు వి.సముద్ర మాట్లాడుతూ ''టైటిల్, పాటలు చాలా బావున్నాయి. సినిమా పెద్ద సక్సెస్ సాధించి ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికీ మంచి పేరు తీసుకురావాలి'' అని అన్నారు.
చిత్ర దర్శకుడు శ్రీనివాస్ రావు.ఎం. మాట్లాడుతూ ''నిర్మాత గారు మంచి సపోర్ట్ అందించారు. మంచి మ్యూజిక్ కుదిరింది. ప్రజంట్ ట్రెండ్ కు కనెక్టయ్యే అంశాలున్నాయి. నటీనటులు, టెక్నిషియన్స్ అందించిన సపోర్ట్‌తో సినిమాను అనుకున్న సమయంలోనే పూర్తి చేశాం'' అన్నారు.
చిత్ర నిర్మాత పైల దేవదాస్‌రెడ్డి మాట్లాడుతూ ''మాది శ్రీకాకుళం. హీరో లోకేష్‌రెడ్డి నాకు మంచి మిత్రుడు. ఇద్దరం కలిసి ఒక మంచి సినిమా చేద్దామనుకుంటున్న తరుణంలో మంచి కాన్సెప్ట్ దొరకడంతో సినిమా ప్రారంభించాము.కథ విషయానికొస్తే... ప్రేమికులు పెద్దల సపోర్ట్ తో పెళ్లి చేసుకుంటేనే అవి నిలబడతాయి. లేకుంటే వారు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందనే అంశానికి ఎంటర్టైన్మెంట్ జోడించి ఈ చిత్రాన్ని రూపొందించాము. సినిమా అంతా శ్రీకాకుళంలో చిత్రీకరించాము. పక్కా ప్లానింగ్ తో ఈ సినిమాను పూర్తి చేశాం. అందరికీ మంచి పేరు తెస్తుందనే నమ్మకంతో ఉన్నాం '' అని అన్నారు.
కిరణ్, అచర్ణరెడ్డి, మణికిరణ్ రెడ్డి, సుమన్‌శెట్టి, చిట్టిబాబు, నాగిరెడ్డి, శ్రీ, రాకెట్ రాఘవ, షేకింగ్ శేషు, గెటప్ శ్రీను తదితయి నటించిన ఈ చిత్రానికి మాటలు : సిద్దె సురేష్, సంగీతం: నందా, పాటలు : నందకిషోర్ కె., వెంకటేష్.కె, అక్షయ్, శ్రీనివాస్‌రావు.ఎం, ఆర్ట్: తెంగాణ సూర్య, ఫొటోగ్రఫీ: ఇ.సత్యహరిశ్చంద్రప్రసాద్, ఎడిటింగ్: నందమూరి హరి, డ్యాన్స్: ఫ్రేమ్ గోపి, నిర్మాత: పైల దేవదాస్‌రెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీనివాస్ రావు.యం.