రెమ్యునరేషన్ తగ్గించుకున్న డైరెక్టర్ పరశురామ్?
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రస్తుతం కరోనా ప్రభావంతో సినీ పరిశ్రమకు చాలా భారీ నష్టాలే వాటిల్లింది. రెండు నెలలు పాటు సినిమాల రిలీజులు లేవు. మరో పక్క జరగాల్సిన షూటింగ్స్ అన్నీ ఆగిపోయాయి. రెండు నెలల తర్వాత ప్రభుత్వాలు షూటింగ్స్‌కు అనుమతులు ఇచ్చినా స్టార్స్ షూటింగ్స్ చేసుకోవడానికి ఆలోచనలు చేస్తున్నారు. మరో పక్క నిర్మాతల పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. ఫైనాన్సియర్స్ నుండి డబ్బులు తీసుకుని సినిమాలు చేసే నిర్మాతలు వాటికి వడ్డీలు చెల్లించడానికి ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో కాస్ట్ కటింగ్ చేయాలనుకుంటున్నారట. నిర్మాతల మండలి నిర్మాణ వ్యయాన్ని తగ్గించుకునే దిశగా ప్రణాళికలు జరుపుతుందట. అందు కోసం అందరికీ 25 రెమ్యునరేషన్స్ తగ్గించి ఇవ్వాలనుకుంటున్నారట.
ఈ క్రమంలో మహేశ్ 27వ చిత్రం ‘సర్కారు వారి పాట’ దర్శకుడు పరుశురామ్‌కు రెమ్యునరేషన్ పరంగా ఇబ్బందే వచ్చిందట. అంతకు ముందుకు గీత గోవిందంకు దాదాపు రూ.9 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకున్నాడు. అయితే మహేశ్ సినిమాకు నిర్మాతలు రూ.7 కోట్ల రూపాయలే ఇస్తామని అన్నారట. ఇక దర్శకుడు కూడా చేసేదేమీ లేక సరేననక తప్పలేదట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments