close
Choose your channels

ఒకేసారి నా ప్రయాణాన్ని గుర్తు చేశారు: పవన్

Saturday, September 5, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఒకేసారి నా ప్రయాణాన్ని గుర్తు చేశారు: పవన్

తన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెప్పిన సినీ, మీడియా మిత్రులకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. తన ప్రయాణాన్ని గుర్తు చేసిన వారికి కూడా శుభాకాంక్షలు తెలిపారు. తన సినీ ప్రస్థానం, మైలురాళ్లను ప్రస్తావిస్తూ సాగిన వ్యాసాలు, కథనాలు రాబోతున్న చిత్రాల వివరాలను పాఠకులకు, వీక్షకులకు తెలియజేయడం తననెంతో సంతోషపరిచిందని.. ఒకసారి తన సినీ ప్రస్థానాన్ని గుర్తు చేశారని పవన్ కొనియాడారు.

‘‘సెప్టెంబర్ 2.. నా జన్మదినం సందర్భంగా సినీ, మీడియా మిత్రులెందరో సామాజికి మాధ్యమాల ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సినిమా ఇన్‌చార్జెస్, విలేకరులు, ఫోటో గ్రాఫర్లు, కెమెరామెన్లు, వెబ్ మీడియా నిర్వాహకులు పాత్రికేయులు ప్రత్యేక కథనాల ద్వారా గ్రీటింగ్స్ చెప్పారు. అందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా సినీ ప్రస్థానం.. మైలురాళ్లను ప్రస్తావిస్తూ సాగిన వ్యాసాలు, కథనాలు, రాబోతున్న చిత్రాల వివరాలను పాఠకులకు, వీక్షకులకు తెలియజేయడం నన్నెంతో సంతోషపరిచింది. ఒకేసారి నా ప్రయాణాన్ని గుర్తు చేశారు.

కష్టాల్లో ఉన్న జనం గళంగా జనసేన నిలుస్తోంది. ప్రజాక్షేత్రంలోనే ఎక్కువ సమయం వెచ్చిస్తున్నాను. సినీ రంగంలో భాగమైన మీడియా మిత్రులు - నేను ప్రజా జీవితంలో ఉన్నా తమవాడిగా భావించి నా అభిమానులకు, సినీ ప్రియులకు కనువిందు చేశారు. నా హితైషులైన సినీ పాత్రికేయులందరికీ మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా’’ అని పవన్ పోస్టు పెట్టారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment