రాబోయేది జనసేన ప్రభుత్వమే గుర్తుపెట్టుకోండి!

  • IndiaGlitz, [Tuesday,April 09 2019]

ఆంధ్రప్రదేశ్‌లో రాబోయేది జనసేన ప్రభుత్వమేనని అంతా గుర్తుపెట్టుకోండని పార్టీ అధినేత పవన్ కల్యాణ్ జోస్యం చెప్పారు. పాలకొల్లులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పవన్ మాట్లాడుతూ.. రానుంది జ‌న‌సేన ప్రభుత్వం.. వైసీపీ-టీడీపీ ప్రభుత్వం కాదు. కాలం మార్పు కోరుకుంటోంది. దాన్ని ఎవ‌రూ క‌నిపెట్టలేరు. ఫ‌లితం వ‌చ్చాకే అది తెలుస్తుంది. 2014 ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీకి స్వీపింగ్ విక్టరీ ఖాయం అన్నారు. ఏం జ‌రిగింది.

పోనీ ఓట‌మి పాఠం నేర్పిందా అంటే అదీ లేదు. గ‌డ‌చిన ఐదేళ్లలో జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి రాష్ట్రానికి ఏం చేశారు. బుగ్గలు నిమురుతూ, గ‌డ్డాలు ప‌ట్టుకుంటూ తిరిగితే ముఖ్యమంత్రి అవ్వరు. ప్రజ‌ల‌కు మ‌ర్యాద ఇస్తే మాత్రమే అవుతారు. ఇంట్లో హ‌త్య జ‌రిగిన‌పుడు పోలీస్ వెరిఫికేష‌న్ చేయించి నిందితుల్ని ప‌ట్టుకుంటే, శాంతిభ‌ద్రత‌ల‌ను బ‌లంగా పాటిస్తే ముఖ్యమంత్రి అవుతారు. తిరుమ‌ల ఏడుకొండ‌ల వాడికి చెప్పులు విడిచి మోక‌రిల్లితే అవుతారు. ఎవ‌రి ఇష్టారాజ్యం వారు చేయ‌డానికి ఇదేం పులివెందుల ఇడుపుల‌పాయ కాదు అని పవన్ ఆగ్రహంతో ఊగిపోయారు.

కేసీఆర్.. కొత్త పార్టీ పెట్టొచ్చుగా!

జ‌గ‌న్‌కి మ‌ద్దతు ఇస్తానంటున్న కేసీఆర్ యాద‌గిరిగుట్టకు చెప్పుల‌తో వ‌స్తానంటే ఒప్పుకుంటారా? మీ దృష్టిలో తెలంగాణ న‌ర‌సింహ‌స్వామి, ఆంధ్రా వెంక‌టేశ్వర స్వామి వేరా..? దైవం మీద గౌరవం లేని అలాంటి వ్యక్తుల‌కు మ‌ద్దతు ఇస్తే ఎలా..? తెలంగాణ‌లో ఆంధ్రులు రాజ‌కీయాలు చేయ‌రాదు. ఆంధ్రలో మాత్రం మీరు రాజ‌కీయాలు చేయొచ్చు. చంద్రబాబు నుంచి ఆంధ్రాప్రజ‌ల్ను కాపాడాలి అనుకుంటే, చంద్రబాబు విమోచ‌న స‌మితి అని వేరే పార్టీ స్థాపించి, అభ్యర్ధుల్ని నిల‌బెట్టి గెలిచి రాష్ట్రాన్ని ర‌క్షించండి అని కేసీఆర్‌కు పవన్ సూచించారు.

More News

అసెంబ్లీలో అడుగుపెడతా.. యువతకు పోలీస్ ఉద్యోగాలిస్తా!

రాజకీయాలకు కావాల్సింది వేలకోట్లు డబ్బు కాదని.. అందరికి ఆమోదయోగ్యంగా ఉండే భావజాలం, మార్పు తీసుకురావాలన్న తపన, ప్రత్యర్ధులను ఎదుర్కొనే గుండె ధైర్యం కావాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.

ఏపీలో మూగబోయిన ఎన్నికల మైక్స్!

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నోటిఫికేషన్ మొదలుకుని నేటి వరకు జరిగిన ఎన్నికల ప్రచారానికి సాయంత్రం 6 గంటలకు ముగిసింది.

స్పీడ్ పెంచిన టెక్ మహీంద్ర.. రెండు కంపెనీల్లో వాటాలు

దేశీయ ఐటీ సంస్థ, ఐటీ సేవల దిగ్గజం టెక్‌ మహీంద్రా వాటాల కొనగోళ్లు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మంగళవారం నాడు మరో రెండు కంపెనీల్లో వాటాలు కొనగోలు చేసేందుకు సర్వం సిద్ధం చేసుకుంది.

అనూహ్యంగా భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్

కొత్త ఎకనమిక్ ఇయర్ ప్రారంభం అయిన నాటి నుంచి స్టాక్ మార్కెట్లు పరుగులు పెడుతున్నాయి.

మాల్యాకు షాకిచ్చిన హైకోర్ట్.. ఈ దెబ్బతో..!

బ్యాంకులకు కోట్లు ఎగ్గొట్టి విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్న విజయ్ మాల్యాకు బ్రిటన్ హైకోర్టు కోలుకోలేని షాకిచ్చింది. భారత్‌కు అప్పగించాలన్న వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్స్ కోర్టు తీర్పును సమర్థించింది.