ఈడీ కేసులో టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్‌కు ఊరట

  • IndiaGlitz, [Friday,July 17 2020]

ఈడీ కేసులో టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్‌కు హైకోర్టులో ఊరట లభించింది. హైకోర్టు ఆయనకు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఇన్ని కేసులు ఓ వ్యక్తిని వేధించడానికి బనాయిస్తున్నారంటూ హైకోర్టు అభిప్రాయపడింది. రవిప్రకాష్‌ను అరెస్ట్ చేసేందుకు వీలు లేదని హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. లక్ష రూపాయల చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని హైకోర్టు తెలిపింది. అలాగే ప్రతి శనివారం ఈడీ ఎదుట హాజరు కావాలని షరతు పెట్టింది. దర్యాప్తును కొనసాగించేందుకు ఈడీకి హైకోర్టు అనుమతినిచ్చింది.

రవిప్రకాష్.. మరో ఇద్దరితో కలిసి టీవీ9 అసోసియేటెడ్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ లిమిటెడ్ నుంచి 2018 సెప్టెంబర్ - 2019 మే వరకూ రూ.18 కోట్ల నిధులను అనుమతుల్లేకుండా ఉపసంహరించినట్టు గతంలో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఆ సంస్థ ప్రతినిధులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. దీని ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు నేడు రవిప్రకాష్‌కు షరతులతో కూడిన ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది.

More News

ఏపీలో రికార్డ్ స్థాయిలో కేసులు.. నేడు ఎన్నంటే..

ఏపీలో కరోనా రోజురోజుకూ విజృంభిస్తోంది. శుక్రవారం కరోనా బులిటెన్‌ను ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది.

సుప్రీంకోర్టులో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి చుక్కెదురు..

సుప్రీంకోర్టులో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి చుక్కెదురైంది. తెలంగాణ సచివాలయం కూల్చివేతకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

చార్మి ఇంట విషాదం.. నిన్ననే చివరి వీడియో కాల్ అంటూ భావోద్వేగం

టాలీవుడ్ హీరోయిన్, నిర్మాత చార్మి ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆమెకు చాలా ఆప్తురాలైన అత్త మృతి చెందారు.

తెలంగాణలో 40 వేలు దాటిన కరోనా కేసులు..

తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకూ భారీగా పెరిగిపోతున్నాయి. కరోనా కేసులు 40 వేలు దాటేశాయి.

గిరిజన విద్యార్థులకు సాయం చేసేందుకు ముందుకొచ్చిన సెంథిల్..

ధర్మపురి ఎంపీ సెంథిల్ కుమార్ గిరిజన విద్యార్థులకు సాయమందించేందుకు ముందుకొచ్చారు.