ఈడీ కేసులో టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్‌కు ఊరట
Send us your feedback to audioarticles@vaarta.com
ఈడీ కేసులో టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్‌కు హైకోర్టులో ఊరట లభించింది. హైకోర్టు ఆయనకు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఇన్ని కేసులు ఓ వ్యక్తిని వేధించడానికి బనాయిస్తున్నారంటూ హైకోర్టు అభిప్రాయపడింది. రవిప్రకాష్‌ను అరెస్ట్ చేసేందుకు వీలు లేదని హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. లక్ష రూపాయల చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని హైకోర్టు తెలిపింది. అలాగే ప్రతి శనివారం ఈడీ ఎదుట హాజరు కావాలని షరతు పెట్టింది. దర్యాప్తును కొనసాగించేందుకు ఈడీకి హైకోర్టు అనుమతినిచ్చింది.
రవిప్రకాష్.. మరో ఇద్దరితో కలిసి టీవీ9 అసోసియేటెడ్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ లిమిటెడ్ నుంచి 2018 సెప్టెంబర్ - 2019 మే వరకూ రూ.18 కోట్ల నిధులను అనుమతుల్లేకుండా ఉపసంహరించినట్టు గతంలో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఆ సంస్థ ప్రతినిధులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. దీని ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు నేడు రవిప్రకాష్‌కు షరతులతో కూడిన ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout