హీరో సూర్యకు ఉపశమనం...
- IndiaGlitz, [Thursday,July 13 2017]
హీరో సూర్యకు కోర్టు కేసు నుండి ఊరట లభించింది. 2009లో ఓ సీనియర్ జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యలకు హీరో సూర్యతో పాటు శరత్‌కుమార్, చేరన్, సత్యరాజ్, అరుణ్ విజయ్, వివేక్, శ్రీప్రియ వంటివారు వ్యతిరేకత తెలపడంతో పాటు జర్నలిస్ట్‌లపై వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆ జర్నలిస్ట్ వీరందరిపై పరువు నష్టం దావా వేశాడు. నటీనటులను నీలగిరి కోర్టు వివరణ కోరింది. కానీ నటీనటులెవ్వరూ స్పందించలేదు. కేసు కఠినం అవుతున్న తరుణంలో లెటెస్ట్ న్యూస్ ప్రకారం ఈ కేసును మద్రాస్ హై కోర్టు కొట్టివేసింది. కోర్టు కేసు కొట్టివేయడంతో అందరూ కేసు నుండి బయటపడ్డట్టే.