కమల్ హాసన్ కు ఊరట..
Send us your feedback to audioarticles@vaarta.com
యూనివర్సల్ హీరో కమల్‌హాసన్‌కు కోర్టు గొడవల నుండి బ్రేక్ దొరికింది. అసలు విషయమేమంటే, మహాభారతంలో మహిళను ఒడ్డి జూదం ఆడటం తప్పు అనేలా, మహాభారతాన్ని కించపరిచాడు అంటూ కొందరు కమల్‌పై కేసు పెట్టారు. అయితే కమల్ హాసన్ తనకెవరినీ కించపరిచే ఉద్దేశం లేదని, క్రింది కోర్టు తనపై ఇచ్చిన సమన్లను కొట్టివేయాలంటూ మద్రాస్ హైకోర్టుకెళ్ళాడు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు క్రింద కోర్టు సమన్లపై స్టే ఇచ్చింది. శభాష్‌నాయుడు షూటింగ్లో గాయపడ్డ కమల్, ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ గ్యాప్‌లోనే తన `విశ్వరూపం2` చిత్రాన్ని విడుదల చేసే ప్రయత్నాలు చేస్తున్నాడు కమల్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com