మాజీ ప్రధానికి ఊరట
Send us your feedback to audioarticles@vaarta.com
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా 'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్'. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఇటీవల విడుదలైంది. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నేతలు ఆరోపిస్తున్నారు.
ఈ సినిమా విడుదల కానివ్వమని హెచ్చరిస్తున్నారు. మరికొంత మంది ఆ ట్రైలర్‌ను నిషేధించాలంటూ ఢిల్లీ హై కోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్‌ను సీరియస్‌గా తీసుకోని న్యాయస్థానం కొట్టి వేసింది.
అయితే సినిమాపై ఏమైనా అభ్యతరం ఉంటే మన్మోహన్ సింగ్‌కు ముందే చూపిస్తామని చిత్ర యూనిట్ ఇంతకుముందు హామీ ఇచ్చింది. ఈ చిత్రంలో మన్మోహన్ సింగ్‌గా అనుపమ్ ఖేర్ నటించారు. విజయ్ రత్నాకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
మన్మోహన్ సింగ్ ప్రధానిగా వున్నప్పుడు ఆయనకు అధికార ప్రతినిధిగా పనిచేసిన సంజయ బారు రాసిన ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ అనే పుస్తకం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని జనవరి 11న విడుదల చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout