కేంద్రానికి రూ.30,791 కోట్ల బాకీ తీర్చిన రిలయన్స్ జియో
Send us your feedback to audioarticles@vaarta.com
కేంద్ర ప్రభుత్వానికి రిలయన్స్ జియో బాకీ తీర్చేసింది. స్పెక్ట్రం కేటాయింపులకు సంబంధించి రూ.30,791 కోట్ల బకాయిలను కేంద్ర ప్రభుత్వానికి చెల్లించినట్లు జియో ప్రకటించింది. మార్చి 2021కి ముందు జరిగిన స్పెక్ట్రం వేలానికి సంబంధించి వడ్డీతో సహా అన్ని బకాయిలను చెల్లించినట్లు పేర్కొంది. 2014, 2015, 2016లో జరిగిన వేలంలో జియోకు స్పెక్ట్రం కేటాయింపులు జరిగాయి.
అలాగే 2021లో భారతి ఎయిర్‌టెల్‌తోనూ స్పెక్ట్రం వినియోగానికి సంబంధించి ఓ అగ్రిమెంట్ కుదిరింది. దీని ద్వారా కంపెనీ 585.3 ఎంహెచ్‌జెడ్ స్పెక్ట్రం సొంతం చేసుకుంది. దీనికి సంబంధించిన బాకీని ఇప్పుడు తీర్చేసింది. ప్రస్తుతం ఉన్న వడ్డీరేటు ప్రకారం.. కంపెనీకి ఏటా రూ.1,200 కోట్లు మిగలనున్నాయని పేర్కొంది. వాస్తవానికి ఈ చెల్లింపులపై కేంద్రం నాలుగేళ్ల మారటోరియం కల్పించింది. కానీ, జియో ఆ సదుపాయాన్ని వినియోగించుకోకుండానే చెల్లింపులు చేసేసింది.
ఇక మరో దేశీయ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ సైతం స్పెక్ట్రానికి సంబంధించి రూ.15,519 కోట్లు డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికాంకు చెల్లించింది. అయితే అప్పుల ఊబిలో కూరుకుపోయిన వొడాఫోన్ ఐడియా (వీఐఎల్), టాటా టెలీసర్వీసెస్ (TTSL), టాటా టెలీసర్వీసెస్ మహారాష్ట్ర (TTML) మాత్రం మారటోరియంను వినియోగించుకుంటామని తెలిపాయి. అంతేకాదు తాము చెల్లించాల్సిన బకాయిలపై వడ్డీ కింద ప్రభుత్వానికి ఈక్విటీ వాటా ఇస్తామని పేర్కొన్నాయి. వీఐఎల్ 35.8 శాతం, టీటీఎస్‌ఎస్, టీటీఎంఎల్ కలిసి 9.5 శాతం ఈక్విటీ వాటాలను ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. దీని నిర్వహణకు సంబంధించి కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సి వుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments