కేంద్రానికి రూ.30,791 కోట్ల బాకీ తీర్చిన రిలయన్స్ జియో

  • IndiaGlitz, [Wednesday,January 19 2022]

కేంద్ర ప్రభుత్వానికి రిలయన్స్ జియో బాకీ తీర్చేసింది. స్పెక్ట్రం కేటాయింపులకు సంబంధించి రూ.30,791 కోట్ల బకాయిలను కేంద్ర ప్రభుత్వానికి చెల్లించినట్లు జియో ప్రకటించింది. మార్చి 2021కి ముందు జరిగిన స్పెక్ట్రం వేలానికి సంబంధించి వడ్డీతో సహా అన్ని బకాయిలను చెల్లించినట్లు పేర్కొంది. 2014, 2015, 2016లో జరిగిన వేలంలో జియోకు స్పెక్ట్రం కేటాయింపులు జరిగాయి.

అలాగే 2021లో భారతి ఎయిర్‌టెల్‌తోనూ స్పెక్ట్రం వినియోగానికి సంబంధించి ఓ అగ్రిమెంట్ కుదిరింది. దీని ద్వారా కంపెనీ 585.3 ఎంహెచ్‌జెడ్‌ స్పెక్ట్రం సొంతం చేసుకుంది. దీనికి సంబంధించిన బాకీని ఇప్పుడు తీర్చేసింది. ప్రస్తుతం ఉన్న వడ్డీరేటు ప్రకారం.. కంపెనీకి ఏటా రూ.1,200 కోట్లు మిగలనున్నాయని పేర్కొంది. వాస్తవానికి ఈ చెల్లింపులపై కేంద్రం నాలుగేళ్ల మారటోరియం కల్పించింది. కానీ, జియో ఆ సదుపాయాన్ని వినియోగించుకోకుండానే చెల్లింపులు చేసేసింది.

ఇక మరో దేశీయ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌ సైతం స్పెక్ట్రానికి సంబంధించి రూ.15,519 కోట్లు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికాంకు చెల్లించింది. అయితే అప్పుల ఊబిలో కూరుకుపోయిన వొడాఫోన్‌ ఐడియా (వీఐఎల్‌), టాటా టెలీసర్వీసెస్‌ (TTSL), టాటా టెలీసర్వీసెస్‌ మహారాష్ట్ర (TTML) మాత్రం మారటోరియంను వినియోగించుకుంటామని తెలిపాయి. అంతేకాదు తాము చెల్లించాల్సిన బకాయిలపై వడ్డీ కింద ప్రభుత్వానికి ఈక్విటీ వాటా ఇస్తామని పేర్కొన్నాయి. వీఐఎల్‌ 35.8 శాతం, టీటీఎస్‌ఎస్‌, టీటీఎంఎల్‌ కలిసి 9.5 శాతం ఈక్విటీ వాటాలను ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. దీని నిర్వహణకు సంబంధించి కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సి వుంది.

More News

బాలయ్య టాక్ షోలో పాల్గొనాలని వుంది... వర్మ ట్వీట్ , అంతలోనే డిలీట్

సినిమాలు, రాజకీయాలు, బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రి వ్యవహారాలతో క్షణం తీరిక లేకుండా వుండే బాలయ్య..

కొందరు యోధులు తయారవుతారు.. కానీ ‘‘గనీ’’ యోధుడిగా పుట్టాడు

బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో దూసుకెళ్తున్నారు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. లవ్ స్టోరీలతో తనకు తిరుగులేదని నిరూపించుకున్న ఆయన..

చంద్రబాబుకు కరోనా.. ‘‘మావయ్య.. మీరు త్వరగా కోలుకోవాలి’’ : ఎన్టీఆర్ ట్వీట్

దేశవ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. సామాన్యులతో పాటు పలువురు ప్రముఖులు కూడా వైరస్ బారినపడుతున్నారు.

ఐదుగురు హీరోయిన్లు, ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లతో ‘‘రావణాసుర’’ పాలన ప్రారంభం

మాస్ మహారాజ్ వరుస సినిమాలతో హోరెత్తిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయన చేతిలో నాలుగైదు సినిమాలు వున్నాయి.

కెరీర్ ను మలుపు తిప్పేలా "వర్మ"... వీడు తేడా- హీరో నట్టి క్రాంతి

న‌టుడిగా ర‌జ‌నీకాంత్‌ అంటే ఇష్టం. సినిమారంగంలో గురువులుగా డా. దాస‌రి నారాయ‌ణరావు, డా. డి. రామానాయుడు అయితే న‌ట‌న గురువుగా స‌త్యానంద్ గార‌ని