OTT:ఈ వారం థియేటర్/ఓటీటీలో సందడి చేస్తున్న సినిమాలు ఇవే..
Send us your feedback to audioarticles@vaarta.com
ఈ వారం సినీ ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్‌టైన్మెంట్ దొరకనుంది. అటు థియేటర్లలో అరడజను సినిమాలు రిలీజ్ కాగా.. ఇటు ఓటీటీల్లోనూ సినిమాలు సందడి చేస్తున్నాయి. యాత్ర-2, ఈగల్, లాల్ సలామ్, ట్రూ లవర్ వంటి సినిమాలు థియేటర్లలో విడుదలయ్యాయి. ఇక ఓటీటీలో గుంటూరు కారం, కెప్టెన్ మిల్లర్ వంటి క్రేజీ సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి.
గుంటూరు కారం: మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వచ్చిన ఈ చిత్రం అర్థరాత్రి నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా అందుబాటులో ఉంది. సంక్రాంతి కానుకగా థియేటర్లలో వచ్చిన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. అయినా కానీ రూ.250కోట్లకు పైగా వసూలు చేసింది.
కెప్టెన్ మిల్లర్: తమిళ స్టార్ హీరో ధనుష్, కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్, తెలుగు హీరో సందీప్ కిషన్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘కెప్టెన్ మిల్లర్’. సంక్రాంతి కానుకగా తమిళంలో విడుదలైన ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోగా.. తెలుగులో మాత్రం నిరాశపరిచింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమ్ అవుతోంది.
అయలాన్: తమిళ హీరో శివకార్తికేయన్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా ఏలియన్ కథాంశం వచ్చిన సైఫై కామెడీ సినిమా ‘అయలాన్’.. సన్ నెక్స్ట్‌లో స్ట్రీమ్ అవుతుంది. అయితే కేవలం తమిళలో మాత్రమే అందుబాటులో ఉంది.
బబుల్‌గమ్: యాంకర్ సుమ కనకాల తనయుడు రోషన్ కనకాల హీరోగా ఎంట్రీ ఇచ్చిన సినిమా ‘బబుల్‌గమ్’. దర్శకుడు రవికాంత్ పేరెపు తెరకెక్కించిన ఈ చిత్రం యూత్‌ని ఓ మోస్తరుగా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది.
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం: ఈటీవీ విన్‌లో స్ట్రీమ్ అవుతుంది.
ది మార్వెల్స్: మర్వెల్ హీరో యూనివర్స్ నుంచి ఆడియన్స్ ముందుకు వచ్చిన మరో సినిమా ‘ది మార్వెల్స్’. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో డిస్నీ హాట్ స్టార్‌లో స్ట్రీమ్ అవుతోంది.
ది నన్ 2, ది ఎక్సర్సిస్ట్ బిలీవర్: ఈ రెండు హాలీవుడ్ సినిమాలు తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో జీ5లో అందుబాటులో ఉన్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com