సూర్య 24 రిలీజ్ కి ముహుర్తం కుదరింది
Send us your feedback to audioarticles@vaarta.com
సూర్య నటిస్తున్న తాజా చిత్రం 24. ఈ చిత్రాన్ని మనం ఫేం విక్రమ్ కుమార్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని తమిళ్ లో సూర్య నిర్మిస్తున్నారు. అయితే తెలుగులో ఈ సినిమా పంపిణీ హక్కులను హీరో నితిన్ దక్కించుకున్నారు. శ్రేష్ట మూవీస్ బ్యానర్ పై నితిన్ ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రంలో సూర్య మూడు విభిన్న పాత్రలో కనిపించనున్నారు.
టైమ్ మిషన్ కథాంశంగా రూపొందుతున్న 24 మూవీ దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంది. సూర్య సరసన సమంత నటిస్తుంది. సంక్రాంతి కి ఈ సినిమాని రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ కుదరలేదు. ఇప్పుడు ఏప్రిల్ 14న తెలుగు, తమిళ్ లో 24 మూవీని రిలీజ్ చేయడానికి ముహుర్తం ఫిక్స్ చేసారు. మరి..సూర్య మూడు డిఫరెంట్ రోల్స్ చేసిన 24తో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments