'ఊపిరి' రిలీజ్ డేట్...
Send us your feedback to audioarticles@vaarta.com
ఫ్రెంచ్ మూవీ 'ది ఇన్‌టచబుల్స్'కి రీమేక్‌గా 'ఊపిరి' సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. నాగార్జున, కార్తీ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ కాగా.. అనుష్క గెస్ట్ రోల్‌లో కనిపించనుంది. ఇదిలా ఉంటే.. సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్ అనే ట్యాగ్‌లైన్‌తో తెరకెక్కిన 'ఊపిరి'లో నాగ్ ది వీల్ ఛైర్‌కి పరిమితమయ్యే పాత్ర అయితే.. సినిమాకి ఊపిరిగా నిలిచే పాత్ర మాత్రం కార్తీదేనట. నాగార్జున పాత్రకి సేవలు చేస్తూ.. సినిమా ఆద్యంతం హుషారుగా సాగే కార్తీ పాత్ర సినిమాకే హైలెట్ అని టాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని మార్చి 25న విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారట. ఈ తేదీన అయితే తెలుగు, తమిళంలో పెద్ద పోటీ ఉన్న చిత్రాలేవీ లేకపోవడంతో సినిమాను తెలుగు, తమిళంలో విడుదల చేయాలని పివిపి సంస్థ భావిస్తుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com