అ ఆ న్యూ రిలీజ్ డేట్..

  • IndiaGlitz, [Saturday,May 14 2016]

యువ హీరో నితిన్ - మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్లో రూపొందుతున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ అ ఆ. ఈ చిత్రంలో నితిన్ స‌ర‌స‌న స‌మంత న‌టించింది. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయ‌ర్ సంగీతం అందించిన అ ఆ ఆడియోకు మంచి స్పంద‌న ల‌భిస్తోంది. ఫ్యామిలీ అంతా క‌లిసి చూసేలా రూపొందిన‌ అ ఆ చిత్రాన్ని మే 6న రిలీజ్ చేయాలి అనుకున్నారు. కానీ..కుద‌ర‌లేదు. ఆత‌ర్వాత మే 27న రిలీజ్ చేయాల‌నుకున్నారు. ఈ డేట్ కు కూడా రిలీజ్ చేయ‌డం కుద‌ర‌డం లేదు. తాజా స‌మాచారం ప్ర‌కారం అ ఆ చిత్రాన్ని జూన్ 3న రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.