రిలేషన్ ఉంటేనే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న స్టార్ హీరో
Send us your feedback to audioarticles@vaarta.com
తను నటించే సినిమాల కోసం స్టార్ హీరోలని సైతం అతిథులుగా దర్శనమయ్యేలా చేసుకోవడం ఆ హీరోకి వెన్నతో పెట్టిన విద్య. అదే తను అతిథి వేషాలు వేయాలంటే మాత్రం.. అది రక్త సంబంధం కి ముడిపడి ఉంటేనే తప్ప మరో రూపంలో సాధ్యం కాదు. ఇంతకీ ఈ ఫార్ములాని ఫాలో అయ్యే హీరో ఎవరంటే.. విక్టరీ వెంకటేష్. తన కెరీర్ ప్రారంభంలో 'త్రిమూర్తులు' కోసం కృష్ణ, శోభన్‌బాబు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున వంటి అగ్ర తారలను.. 'చింతకాయల రవి' కోసం ఎన్టీఆర్ వంటి టాప్ హీరోని అతిథి వేషంలో దర్శనమిచ్చేలా చేసుకున్న వెంకటేష్..
తన కెరీర్ మొత్తమ్మీద రెండుసార్లు అతిథి వేషాలేసాడు. పదేళ్ల క్రితం తన సోదరుడు డి.సురేష్‌బాబు నిర్మించిన 'సోగ్గాడు' కోసం ఓ పాటలో తళుక్కున మెరిసిన వెంకటేష్.. మళ్లీ తన సోదరుడి కొడుకు రానా నటించిన 'కృష్ణం వందే జగద్గురుమ్' కోసం ఓ పాటలో దర్శనమిచ్చాడు. కట్ చేస్తే.. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి గెస్ట్ రోల్లో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాడు వెంకీ. ఈ సారి తన సోదరి కుమారుడు నాగచైతన్య నటిస్తున్న 'ప్రేమమ్' కోసం ఆ పరంపరని కొనసాగిస్తున్నాడని సమాచారం. మొత్తమ్మీద.. బంధుత్వాన్ని దృష్టి పెట్టుకునే అతిథి వేషాలేస్తున్న వెంకీ.. భవిష్యత్‌లోనూ ఇదే బాటలో పయనిస్తారో.. లేదంటే ట్రాక్ మారుస్తారో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments