థియేటర్స్ కు కేంద్ర ప్రభుత్వం సూచించిన నిబంధనలు...
Send us your feedback to audioarticles@vaarta.com
కోవిడ్ ప్రభావంతో సినిమా రంగం కుదేలైంది. ఆరు నెలలు థియేటర్స్ మూతపడ్డాయి. సినిమా షూటింగ్స్ ఆగిపోయాయి. ఇటీవల సినిమా షూటింగ్స్‌కు కొన్ని నియమనిబంధనలతో ఓకే చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఇటీవల అక్టోబర్ 15 నుండి థియేటర్స్‌ను 50 శాతం ఆక్యుపెన్సీతో ఓపెన్ చేసుకోవచ్చునని తెలియజేసింది. మంగళవారం ప్రేక్షకుల సేఫ్టీ కోసం థియేటర్ నిర్వాహకులు ఎలాంటి నియమాలను పాటించాలనే దానిపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో కేంద్ర సమాచార ప్రసార శాఖా మంత్రి ప్రకాశ్ జవదేకర్ థియేటర్స్ ఎలాంటి రూల్స్ పాటించాలనే దానిపై వివరణ ఇచ్చారు.
1. 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్స్‌ను ఓపెన్ చేయాలి.
2. సీట్ల మధ్య భౌతిక దూరం ఉండేలా చూసుకోవాలి
3. మార్క్ చేసిన సీట్లో ప్రేక్షకుడిని కూర్చోకుండా చూడాలి
4. చేతులు శుభ్రపరుచుకునే శానిటైజర్స్‌ను తప్పకుండా ఏర్పాటు చేయాలి.
5. థియేటర్‌కు వచ్చే ప్రేక్షకులు ఆరోగ్యసేతు యాప్‌ను డౌన్లోడ్ చేసుకోమని సూచించాలి.
6. థెర్మల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేసుకోవాలి. ఎలాంటి లక్షణాలు లేనివారినే థియేటర్లోకి పంపాలి
7. ఆరోగ్య సమస్యలపై మానిటరేట్ చేయాలి
8. మల్టీప్లెక్స్‌ల్లో వేర్వేరు స్క్రీన్స్‌లో వేర్వేరు టైమింగ్స్ ఉండేలా చూసుకోవాలి
9. టికెట్ పేమెంట్‌ను డిజిటల్ పద్ధతిలో తీసుకోవాలి.
10. థియేటర్స్, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
11. తగినన్ని టికెట్ కౌంటర్స్ ఉండేలా చూసుకోవాలి
12. విరామ సమయంలో ప్రేక్షకులు గుంపులు గుంపులుగా ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
13. థియేటర్ సిబ్బంది కూడా భౌతిక దూరం పాటించాలి
14. బాక్సాఫీస్ వద్ద టికెట్స్ ను రోజంతా ప్రేక్షకులకు లభ్యమయ్యేలా చర్యలు తీసుకోవాలి.
15. ఉమ్మివేయడం నిషేధం
16. గాలి ద్వారా బాగా వచ్చేలా చూసుకోవాలి
17. ప్రేక్షకులకు ప్యాకెడ్ ఫుడ్‌ను మాత్రం అందించాలి. థియేటర్ లోపల సీట్ల వద్దకు ఫుడ్‌ను అందించకూడదు
18. ఫుడ్ ఇతర తినుబండారాలకు సంబంధించి ఎక్కువ కౌంటర్స్ ఉండేలా చూసుకోవాలి
19. థియేటర్ సిబ్బంది కూడా బూట్లు, గ్లవ్స్, మాస్కులు, పీపీఈ కిట్స్ వేసుకుని శానిటైజ్ చేసుకోవాలి.
20. ప్రేక్షకుల కాంటాక్స్ నెంబర్ తప్పకుండా తీసుకోవాలి
21. ఎక్కువ సంఖ్యలో కౌంటర్స్‌ను ఏర్పాటు చేసుకోవాలి
22. కోవిడ్ నిబంధనలను పాటించని చర్యలను కఠినంగా నిరోధించాలి
23. థియేటర్స్‌లోని ఏసీల టెంపరేచర్ 24-30 మధ్య ఉండేలా చూసుకోవాలి
24. షో ప్రారంభమయ్యే ముందు, ఇంటర్వెల్, షో చివరలో కోవిడ్ నిబంధనలను అనౌన్స్‌మెంట్‌గా ఇవ్వాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com