అవసరాలతో రెజీనా..?

  • IndiaGlitz, [Monday,July 25 2016]

నటుడిగా, దర్శకుడిగా రాణిస్తున్న అవసరాల శ్రీనివాస్ ఇప్పుడు ఓ బాలీవుడ్ చిత్రంలో నటించనున్నాడు. 'హంటర్' అనే బాలీవుడ్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై నవీన్ మేడారం తెరకెక్కిస్తార‌ని అంటున్నారు. ప్రస్తుతం 'జో అచ్యుతానంద' చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్న అవసరాల శ్రీనివాస్ ఆ సినిమా పూర్తయిన వెంటనే ఈ రీమేక్ సినిమాను సెట్స్ లోకి వెళుతుంది.

ఈ చిత్రంలో అవ‌స‌రాల శ్రీనివాస సెక్స్ అడిక్ట‌డ్ ప‌ర్స‌న్‌గా క‌నిపించ‌నున్నాడు. ఈ చిత్రంలో అవ‌స‌రాల శ్రీనివాస్ స‌ర‌స‌న రెజీనా న‌టిస్తుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. చిన్న న‌టుడిగా ఎంట్రీ ఇచ్చిన అవ‌స‌రాల త‌న‌దైన కామెడితోనే కాకుండా రీసెంట్ మూవీ జెంటిల్‌మ‌న్‌లో విల‌న్‌కూడా క‌న‌ప‌డ్డాడు. ఇప్పుడు ఏకంగా హీరోగా కూడా సంద‌డి చేయ‌బోతున్నాడు మ‌రి.

More News

కన్నడ రీమేక్ లో ఆది...

ఆగస్ట్ 5న `చుట్టాలబ్బాయి`గా తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి హీరో ఆది, తండ్రితో సాయికుమార్తో కలిసి రెడీ అయిపోయాడు. ఈ సినిమా తర్వాత హీరో ఆది తన తదుపరి చిత్రంగా కన్నడ ఘన విజయం సాధించిన `ఫస్ట్ ర్యాంక్ రాజ్` చిత్రాన్ని రీమేక్ లో నటించనున్నాడట.

వెంకటేష్ ను బాబు...బంగారం అని ఇప్పుడు అంటున్నారు కానీ...నేను ఆరోజే చెప్పాను - దర్శకరత్న దాసరి

విక్టరీ వెంకటేష్-యువ దర్శకుడు మారుతి కాంబినేషన్లో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ బాబు బంగారం.ఈ చిత్రంలో వెంకటేష్ సరసన అందాలతార నయనతార నటించింది.

హరితహారం లో పాల్గొన్న మజ్ను చిత్ర బృందం

పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో తెలంగాణా ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమం లో మజ్ను చిత్ర బృందం పాల్గొన్నారు.

ఆగస్ట్ 5 న 'మరల తెలుపనా ప్రియా' విడుదల

ప్రిన్స్,వ్యోమనంది,పూజా రామచంద్రన్ లు హీరో హీరోయిన్లుగా శ్రీ చైత్ర చలన చిత్ర నిర్మాణ సారథ్యంలో రూపుదిద్దుకున్న చిత్రం'మరల తెలుపనా ప్రియా'.ఈ చిత్రం ఆగస్ట్ 5న విడుదలకు సిద్ధమైంది.

29న 'బంతిపూల జానకి' ఆడియో!!

సాధారణంగా భారీ బడ్జెట్ సినిమాలు,లేదా భారీ బ్యాక్ గ్రౌండ్ గలవారు నిర్మించే సినిమాల ఆడియో వేడుకలు మాత్రమే హైద్రాబాద్, హైటెక్ సిటీకి సమీపంలో గల "శిల్ప కళా వేదిక"పై జరుగుతాయి.