రెజీనాకి ఇదో ఎక్స్ పీరియన్స్

  • IndiaGlitz, [Saturday,November 21 2015]

కొత్త జంట‌, ప‌వ‌ర్, పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్‌.. వంటి విజ‌యాల‌తో ఆక‌ట్టుకున్న క‌థానాయిక రెజీనా. ప్ర‌స్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో ఉన్న తెలుగు చిత్రాలు 'సౌఖ్యం', 'శౌర్య‌'. 'సౌఖ్యం'లో గోపీచంద్ హీరో కాగా.. 'శౌర్య‌'లో మంచు మ‌నోజ్ క‌థానాయ‌కుడు. ఈ రెండు సినిమాలు నెల రోజుల గ్యాప్‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాయి.

'సౌఖ్యం' క్రిస్మ‌స్ కానుక‌గా డిసెంబ‌ర్ 25 న రానుంటే.. 'శౌర్య' జ‌న‌వ‌రి నెలాఖ‌రులో రానుంది. విశేష‌మేమిటంటే.. ఈ రెండు సినిమాలు కూడా ఆయా క‌థానాయ‌కుల‌కు ఆయా చిత్రాల ద‌ర్శ‌కుల‌తో చేస్తున్న రెండో ప్ర‌య‌త్నాలు కావ‌డం. 'య‌జ్ఞం' త‌రువాత ఎ.ఎస్‌.ర‌వికుమార్ చౌద‌రితో గోపీచంద్ చేస్తున్న సినిమా 'సౌఖ్యం' కాగా.. 'శ్రీ' త‌రువాత ద‌శ‌ర‌థ్ డైరెక్ష‌న్‌లో మంచు మ‌నోజ్ చేస్తున్న రెండో సినిమా 'శౌర్య‌'. మొత్తంగా 'సెకండ్ టైమ్' కాంబినేష‌న్‌ల సినిమాల‌తో రెజీనాకి ఓ కొత్త ఎక్స్‌పీరియ‌న్స్ ఎదుర‌వుతోంద‌న్న‌మాట‌.

More News

నో స్మోకింగ్.. నో డ్రింకింగ్..

ధూమపానం, మద్య పానం.. ఇలాంటి సన్నివేశాలు కూడా సినిమాలు తెరకెక్కడం అరుదు. అలాంటి అరుదైన సినిమాగా మరో సినిమా చేరనుంది. అదే 'మిరుదన్'.

నెగెటివ్ రోల్ లో కాజల్?

ఇప్పటివరకు పాజిటివ్ రోల్స్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన కాజల్..ఓ తమిళ చిత్రం కోసం నెగెటివ్ టచ్ ఉన్న రోల్ లో కనిపించనుందని సమచారామ్.

మహేష్ ఖాతాలో మరో బాలీవుడ్ బ్యూటీ?

నమ్రతా శిరోద్కర్,సోనాలి బింద్రే,బిపాసా బసు,లీసారే,అమృతా రావ్..ఈ బాలీవుడ్ భామలందరికి ఓ కామన్ ఫ్యాక్టర్ ఉంది. అదేమిటంటే..

ఆ రోజుతో 'నాన్నకు ప్రేమతో' పూర్తి

'టెంపర్ 'వంటి బంపర్ హిట్ తరువాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం 'నాన్నకు ప్రేమతో'.సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది.

సూర్య రాక అప్పుడే

సూర్య కీలక పాత్రలో నటించిన తమిళ చిత్రం 'పసంగ 2'.తెలుగులో 'మేము ' పేరుతో రిలీజ్ కానుందీ సినిమా.