చిరంజీవి చిత్రంలో రెజినా ఐటెం సాంగ్ ?

ఖైదీ నంబర్ 150, సైరా నరసింహారెడ్డి సినిమాలతో సెకండ్ ఇన్నింగ్సును అద్భుతంగా కొనసాగిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. ప్రస్తుతం ఆయన కొరటాల శివ డైరెక్షన్‌లో చేసే సినిమా కోసం సన్నద్ధమవుతున్నారు. జనవరి నుంచి ప్రారంభయ్యే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ టాలీవుడ్‌లొ చక్కర్లు కొడుతోంది. చిరుతో కలిసి రెజీనా స్టెప్పులేయనుందనేది ప్రచారం జరుగుతోంది. చిరు 152వ సినిమాలో వచ్చే ఓ ఐటెం సాంగులో రెజీనా కనిపించనుందనేది ఆ వార్తల సారాంశం. మొదట చాలా మంది క్రేజీ హీరోయిన్లను అనుకున్నా.. చివరకు ఆమెను అనుకున్నారని టాలీవుడ్ టాక్. ఈ మధ్య వస్తున్న ఐటెం సాంగ్స్‌లో పెద్ద పెద్ద హీరోయిన్లు కూడా కనువిందు చేస్తున్నారు. కాజల్, తమన్నా లాంటి స్టార్ హీరోయన్స్ ఏమాత్రం వెనకడుగు వేయకపోవడం విశేషం. ఇంతకూ ఈ సినిమాకు రెజీనా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందో లేదో తెలియాలంటే.. మరికొద్ది కాలం వేచి చూడాల్సిందే.

కొణిదెల ప్రొడక్షన్‌లో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నట్టు సమాచారం. త్రిషను హీరోయిన్‌గా ఓకే చేశారని చెబుతున్నారు. అధికారిక స‌మాచారం రావాల్సి ఉంది. ఈమె చిరుతో కలిసి గతంలో స్టాలిన్ సినిమా చేసింది ఈ అమ్మడు. మళ్లీ చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడు మరోసారి చిరంజీవితో కలిసి తెరను పంచుకోనుంది. సినిమాను ఆగ‌స్ట్ రెండో వారం విడుద‌ల చేయాల‌ని అనుకుంటున్నారు.