సరికొత్త పాత్రలో రెజీనా....
Send us your feedback to audioarticles@vaarta.com
చెన్నై సొగసరి రెజీనా కసండ్ర ఇప్పుడు విలక్షణమైన కాన్సెప్ట్ ఉన్న సినిమాల్లో నటించడానికి ఆసక్తి చూపిస్తుంది. నక్షత్రం చిత్రంలో సందీప్‌కిషన్ సరసన నటిస్తుంది. హిందీలో అంఖే2 చిత్రంలో అమితాబ్ తో కలిసి యాక్ట్ చేస్తుంది. కాగా ఈ రెండు చిత్రాలతో పాటు దగ్గుబాటి రానా హీరోగా రూపొందుతోన్న ఓ పీరియాడిక్ మూవీలో రెజీనా హీరోయిన్‌గా నటించనుంది. స్వాంతత్ర్యానికి ముందు సుభాష్ చంద్రబోస్ నడిపిన ఆజాద్ హిందుఫౌజులో ఆర్మీ ఆఫీసర్ పాత్రలో రానా నటిస్తుంటే..రానాను పెళ్లాడనుకున్న వైశ్య(చెట్టియార్) యువతి పాత్రలో రెజీనా నటించనుంది. చెన్నై, కేరళ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమా రెజీనా వేషధారణ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటుందని అంటున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com