ఆ!..రెజీనా..

  • IndiaGlitz, [Wednesday,December 13 2017]

ఈరోజు విక్ట‌రీ వెంక‌టేష్ పుట్టిన‌రోజు ..ఆయ‌న‌తో పాటు హీరోయిన్ రెజీనా పుట్టిన‌రోజు అని త‌క్కువ మందికే తెలుసు. ఇప్పుడు రెజీనా న‌టిస్తున్న చిత్రం 'అ!'. డిసెంబ‌ర్ 13న రెజీనా పుట్టిన‌రోజు సంద‌ర్భంగా 'అ!' సినిమాకు సంబంధించిన ఆమె లుక్‌ను యూనిట్ విడుద‌ల చేసింది. చేతులు, వీపుపై టాటూలు, విభిన్న‌మైన హెయిర్ స్ట‌యిల్‌తో రెజీనా లుక్‌కు కొత్త‌గా ఉంది.

ఫిబ్ర‌వ‌రిలో ఈ సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో ఇంకా కాజ‌ల్ అగ‌ర్వాల్‌, నిత్యామీన‌న్, ఈషా రెబ్బా, అవ‌స‌రాల శ్రీనివాస్ త‌దిత‌రులు తారాణంగా న‌టిస్తున్నారు. వాల్ పోస్ట‌ర్ సినిమా బ్యాన‌ర్‌పై హీరో నాని ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

ప్ర‌శాంతి త్రిపిర్నేని నిర్మాత‌. ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌కుడు. ఈ సినిమా ఇప్ప‌టికే ఎన‌భై శాతం పైగా చిత్రీక‌ర‌ణను పూర్తి చేసుకుంది. ఇప్ప‌టికే నిత్యామీన‌న్‌, ఈషారెబ్బా, అవ‌స‌రాల శ్రీనివాస్‌ల ఫ‌స్ట్ లుక్‌ల‌ను అల్రెడి విడుద‌ల చేశారు.

More News

సరికొత్త పాత్రలో సన్నిలియోన్

ఈ మధ్య బయోపిక్ ల చిత్రీకరణ ఎక్కువైంది. క్రికెటర్లు, స్పోర్ట్స్ పర్సన్స్, స్వామిజీలు, సైంటిస్టులు, రాజకీయ నాయకులు ఇలా పలువురి జీవితాలపై సినిమాలు రూపొందుతున్నాయి. త్వరలోనే బాలీవుడ్లో మరో బయోపిక్ కు శ్రీకారం చుడుతున్నారు.

60 శాతం చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకున్న 'మేళా'

మామిడి వెంకటలక్ష్మి సమర్పణలో కొంకా ప్రొడక్షన్స్‌, పి.ఎస్‌.పి.ఫిలింస్‌ బ్యానర్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'మేళా'. సూర్యతేజ్‌, ధన్సిక, సిమ్రాన్‌, సోని చరిష్టా తదితరులు ప్రధాన తారాగణం.

రెగ్యులర్ షూట్ లో జగపతిబాబు-నారా రోహిత్ ల 'ఆటగాళ్లు'

వెర్సటైల్ ఆర్టిస్ట్స్ జగపతిబాబు-నారా రోహిత్ టైటిల్ పాత్రధారులుగా పరుచూరి మురళి దర్శకత్వంలో తెరకెక్కనున్న సస్పెన్స్ థ్రిల్లర్ 'ఆటగాళ్లు' రెగ్యులర్ షూటింగ్ నేడు మొదలైంది.

'ఎంసీఏ' థియేట్రికల్ ట్రైలర్ విడుదల

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో శ్రీ వెంకటే్శ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్రాజు, శిరీష్, లక్ష్మణ నిర్మాతలుగా సినిమా నిర్మితమవుతుంది. ఈ సినిమా డిసెంబర్ 21న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది.

ఈ నెల 15 న వస్తున్న లచ్చి

ఓ ప్రముఖ ఛానెల్లో వెన్నెల అనే పోగ్రాం ద్వారా బుల్లి తెర ప్రేక్షకులకి దగ్గరైన జయతి మెట్టమెదటిసారిగా హీరోయిన్ గా నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం లచ్చి.