ఆ హీరోయిన్ మరోసారి విలన్గా..!
- IndiaGlitz, [Sunday,September 15 2019]
ఇప్పుడు సినిమా హీరో, హీరోయిన్స్ ట్రెండ్ మారుస్తున్నారు. వైవిధ్యమైన కథా చిత్రాలను చేయడానికి ఆసక్తిని చూపుతున్నారు. కథానాయకులు, నాయకిలు ప్రతి నాయక పాత్రలను పోషించడానికి రెఢీ అయిపోతున్నారు. పాత్రకు ప్రాధాన్యం ఉంటే చాలు వైవిధ్యమైన పాత్రలు చేయడానికి తాము సిద్ధమేనంటున్నారు వీరు. ఈ కోవలోకి హీరో్యిన్ రెజీనా జాయిన్ అయ్యింది. ఇటీవల విడుదలైన 'ఎవరు' సినిమాలో సమీర్ అనే పాత్రలో రెజీనా కసండ్ర నెగెటివ్ టచ్ ఉన్న పాత్రలో అద్భుతంగా నటించారు. ప్రేక్షకులు ఈమె నటనను ప్రశసించారు. అంతకు ముందు కూడా ఈమె '7' మూవీలో కూడా నెగెటివ్ టచ్ ఉన్న పాత్రలో నటించారు. తాజాగా మరోసారి రెజీనా నెగెటివ్ పాత్రలో కనపడబోతున్నారని సమాచారం.
విశాల్ హీరోగా ఆనంద్ అనే కొత్త దర్శకుడు ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్గా నటిస్తున్నారు. విశాల్ మిలటరీ ఆఫీసర్గా నటిస్తుండగా, శ్రద్ధా శ్రీనాథ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుంది. కోయంబత్తూర్లో సినిమా షూటింగ్ జరుగుతుంది. ఈ చిత్రంలో రెజీనా కసండ్ర నెగెటివ్ టచ్ ఉన్న పాత్రలో నటిస్తుంది. నిజానికి చెన్నైకి చెందిన హీరోయిన్ రెజీనా తన స్వంత ఇండస్ట్రీలో రాణించాలని కోరుకుంటుంది. అయితే ఆమెకు తమిళంలో మాత్రం బ్రేక్ రాలేదు. చాలా రోజులుగా తమిళంలో మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న రెజీనాకు ఈ సినిమాతో అయినా బ్రేక్ దక్కుతుందేమో చూద్దాం.