స్టూడెంట్ పాత్రలో..
Send us your feedback to audioarticles@vaarta.com
రెజీనా కసండ్ర.. తమిళ సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన ఈ చెన్నై అమ్మడు తెలుగు సినిమాల్లో రాణించే ప్రయత్నాలు చేసింది. కొంత మేర సక్సెస్ సాధించినా స్టార్ హీరోయిన్‌గా మాత్రం పేరు తెచ్చుకోలేకపోయింది. అయితే మంచి పెర్ఫామర్ అయిన రెజీనా అ! చిత్రంలో డిఫరెంట్ లుక్‌తో అలరించింది.
ఇప్పుడు నిజార్ షఫీ తెరకెక్కిస్తున్న `7` చిత్రంలో సైకాలజీ స్టూడెంట్ పాత్రలో నటిస్తుంది. చెన్నైలో సైకాలజీ స్టూడెంట్ అయిన రెజీనాకు ఈ సినిమాలో నటిస్తుంటే కాలేజీ రోజులు గుర్తుకు వస్తున్నాయట. ఈ పాత్రలో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయట. అందుకనే నిజార్ షఫీ నెరేషన్ ఇవ్వగానే ఎస్ చెప్పడానికి ఎక్కువ సమయం తీసుకోలేదట రెజీనా కసండ్ర.
మరి సినిమాలో తన నటనతో రెజీనా ఎలా మెప్పించనుందో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Iniya Vaishnavi
Contact at support@indiaglitz.com
Comments