రూమర్స్ పై రెజీనా స్ట్రాంగ్ రియాక్షన్..
Send us your feedback to audioarticles@vaarta.com
పిల్లా నువ్వులేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్, శౌర్య...తదితర చిత్రాలతో ఆకట్టుకుంటున్న కథానాయిక రెజీనా. ఈ అందాల భామ రెజీనాకి మెగా హీరో సాయిథరమ్ తేజ్ తో ఎఫైర్ ఉందంటూ వార్తలు షికారు చేస్తున్నాయి. ఈ ఎఫైర్ గురించి రెజీనాని అడిగితే...అలాంటిది ఏమీ లేదండీ అని చెప్పేది. అయినా ఈ వార్తలు ఈమధ్య ఎక్కువ అవుతుండడంతో కాస్త స్ట్రాంగ్ రియాక్షనే ఇచ్చింది రెజీనా. ఎఫైర్ న్యూస్ గురించి తన మనసులో మాటలను ఫార్ట్ ఫిల్మ్ రూపంలో బయట పెట్టింది.
ఈ షార్ట్ ఫిల్మ్ లో....మార్క్ ట్వీన్ అన్నాడు నిజం మంకీ షూ వేసుకునే లోపే అబద్దం ప్రపంచం మొత్తం చుట్టేస్తుందట. ఈ అంట అనే ఫేక్ పునాది మీదే ఇండస్ట్రీలో కోటలు కట్టేస్తారు. ఒక ఏక్టరస్ కి - ఫ్యాన్ కి మధ్య అమ్మాయి కూడా ఉంటుందనే విషయం మరచిపోతున్నారు. ఒక్కసారి మేము ఇంటికి వెళితే మా చెప్పులతో పాటు స్టార్ డమ్ కూడా వదిలేసి వెళతాం. అప్పుడు మా పేరెంట్స్ కి ఆన్సర్ చేయాల్సింది ఒక అమ్మాయిలాగే. ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టద్దు అని అంటోంది రెజీనా. గాసిప్ సృష్టించేవాడికి కాదు మింగేవాడికి తెలుస్తుంది. ఆ..స్పైసీ గాసిప్ మంట.ఏ హీరోయిన్ కావాలని అందాలను ప్రదర్శించదు...అది తమ ఫ్రొఫెషన్ అనీ...షూటింగ్ అయిన వెంటనే అందరి అమ్మాయిల వలే హీరోయిన్స్ కూడా డ్రెస్ వేసుకుంటారని చెప్పింది. మరి...ఈ షార్ట్ ఫిల్మ్ చూసిన తర్వాతైనా రెజీనా పై పుకార్ల షికార్లు ఆగుతాయేమో చూద్దాం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com