పెంకి అమ్మాయిగా రెజీనా
Send us your feedback to audioarticles@vaarta.com
పిల్లా నువ్వు లేని జీవితం, పవర్, సుబ్రమణ్యం ఫర్ సేల్, జో అచ్యుతానంద వంటి విజయవంతమైన చిత్రాల్లో సందడి చేసిన యువ కథానాయిక రెజీనా. జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుపోతున్న ఈ చెన్నై చిన్నది.. ప్రస్తుతం నారా రోహిత్‌కి జోడీగా బాలకృష్ణుడు చిత్రం చేస్తోంది. ఈ నెల 24న ఈ సినిమా విడుదల కానుంది.
ఈ సినిమా తన కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్‌గా నిలుస్తుందని రెజీనా చెప్పుకొస్తోంది. అంతేకాకుండా.. ఇందులో తను డబ్బు ఉన్న అమ్మాయిగా కనిపిస్తానని.. తను ఏం కావాలనుకుంటే అది జరిగిపోవాలనుకునే మనస్తత్వం ఉన్న పెంకి అమ్మాయి పాత్రలో నటించానని రెజీనా చెప్పుకొస్తోంది.
యాక్టింగ్ స్కోప్ ఉన్న ఈ పాత్ర కోసం సబ్జెక్ట్ డిమాండ్ మేరకు ఫైట్స్ కూడా చేశానని.. ముఖ్యంగా రోప్ షాట్స్ చేయడం కొత్త అనుభూతినిచ్చిందని తెలిపింది రెజీనా. బాగా కష్టపడి చేసిన ఈ సినిమా తనకు తప్పకుండా మంచి గుర్తింపు తీసుకువస్తుందన్న నమ్మకంతో ఉన్నానని ధీమాగా చెబుతోంది ఈ ముద్దుగుమ్మ.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com