Reel vs Real: అటు రీల్ స్టార్లు.. ఇటు రియల్ స్టార్లు.. ఇదే తేడా..

  • IndiaGlitz, [Thursday,May 09 2024]

ఏపీ ఎన్నికలు హోరాహోరీగా సాగుతున్నాయి. పోలింగ్‌కు నాలుగు రోజులు మాత్రమే సమయం ఉండటంతో అభ్యర్థులు ప్రచారం హోరెత్తిస్తున్నారు. ఓవైపు అధికార వైసీపీ.. మరోవైపు టీడీపీ కూటమి పోటీ పడుతున్నాయి. ఈ సందర్భంగా కూటమి తరపున స్టార్ క్యాంపెయినర్లు ప్రచారం చేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీకి చెందిన నటులు రంగంలోకి దిగారు. నందమూరి బాలకృష్ణ, పవన్ కల్యాణ్ లాంటి స్టార్లు హిందూపురం, పిఠాపురం పోటీచేస్తూనే నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు.

ఇక పవన్ కల్యాణ్ తరపున జబర్ధస్త్ నటులు హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను తదితరులు ప్రచారం చేయగా.. మెగా కాంపౌండ్ హీరోలు సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ్‌ తేజ్ వంటి వాళ్ళు సైతం ప్రజల్లోకి వెళ్లి కూటమికి ఓటేయాలని అడుగుతున్నారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి సైతం తన తమ్ముడు పవన్ కళ్యాణ్‌ను పిఠాపురంలో గెలిపించాలని కోరుతూ వీడియో విడుదల చేశారు. వీరితో పాటు నేచురల్ స్టార్ నాని, రాజ్ తరుణ్, తేజ సజ్జా, సంపూర్ణేశ్ బాబు ఇలా కూటమి వైపు పెద్ద పెద్ద సినిమా స్టార్లు ప్రచారం చేస్తున్నారు.

కూటమి తరపున ఇలా స్టార్లు ప్రచారం చేస్తుండగా.. ఇటు సీఎం వైయస్ జగన్ సారథ్యంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రజలే ప్రచార సారథులుగా ముందుకు సాగుతోంది. ఓవైపు అంతా తానై జగన్ ప్రచారం చేస్తుండగా.. మరోవైపు జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో లబ్ధిపొందిన వారు ఆయన కోసం ప్రచారం చేస్తున్నారు. తెలుగుదేశం హయాంలో పెన్షన్ కోసం ఇబ్బంది పడిన ఓ తాత... అమ్మఒడి అందుకున్న ఓ అక్క... జగనన్న విద్యా కనుక అందుకున్న ఒక కుర్రాడి తల్లి... ఆసరా అనుకున్న ఓ అక్క... ఇలా పేదలే జగన్ తరఫున ప్రచారం చేస్తున్నారు. మీ అందరికీ మంచి జరగాలి అంటే మళ్లీ జగన్ గెలవాలి అని ఇంటింటికి వెళ్లి ప్రజలకు చెబుతున్నారు. అటు సినిమా వాళ్లు స్టార్ క్యాంపెయినర్లుగా ఉంటే.. ఇటు పేదలే స్టార్ క్యాంపెయినర్లుగా ఉంటూ వైసీపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తు్న్నారు.

More News

EC:ఏపీలో సంక్షేమ ప‌థ‌కాల న‌గ‌దు విడుదలపై ఈసీ ఆంక్షలు

ఏపీలో ఎన్నికల వేళ సంక్షేమ పథకాల నిధుల విడుదలపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది.

Jagan:జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దన్న సీబీఐ.. తీర్పు వాయిదా..

లండన్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని ఏపీ సీఎం జగన్(CM Jagan)నాంపల్లి  సీబీఐ కోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.

PM Modi: వైసీపీ కౌంట్‌డౌన్‌ మొదలైంది.. పక్కా ట్రీట్‌మెంట్ ఇస్తాం: మోదీ

ఏపీలో వైసీపీకి కౌంట్ డౌన్ ప్రారంభమైందని ప్రధాని మోదీ తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పీలేరు బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో మాఫియా రాజ్యం నడుస్తోందని..

CM Jagan:క్రేజ్ కా బాప్.. ఎన్నికల వేళ సంచలనంగా సీఎం జగన్ ఇంటర్వ్యూ..

సీఎం జగన్‌కు ప్రజల్లో ఉన్న క్రేజ్ ఏంటో మరోసారి రుజువైంది. పోలింగ్‌కు నాలుగు రోజుల ముందు జగన్ టీవీ9కి ఇచ్చిన ఇంటర్వ్యూ ఏపీ రాజకీయాల్లో

KTR:జైలుకు వెళ్లడానికి నేను సిద్ధం.. నువ్వు సిద్ధమా..? రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్..

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి మరోసారి మాజీ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా